Coronavirus vaccine: కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఓ వైపు ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకుంటూనే మరోవైపు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్నీ టీకాను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో తామే ముందున్నామంటే.. తామే ముందున్నామంటూ కొన్ని దేశాలు ఎప్పటికప్పుడు ప్రకటనలు సైతం గుప్పిస్తున్నాయి. ఇంతకీ వ్యాక్సిన్ తయారీలో ఏ దేశం ముందుంది ? ఏయే దేశాల్లో మానవులపై వ్యాక్సిన్ ప్రయోగాలు ( Human trials ) ఏ దశలో ఉన్నాయనే వివరాలను ఓసారి పరిశీలిద్దాం. ( Also read: Jio Glass price: జియో గ్లాస్ ధర ఎంత ? జియో గ్లాస్ ఫీచర్స్ ఏంటి ? )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాలో కోవిడ్-19 వ్యాక్సిన్ ( COVID-19 vaccine in US ):
అమెరికాలో కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో ముందున్నామని చెబుతున్న మొడర్నా బయోటెక్ సంస్థ... జూలై 27 నుంచి తుది దశ ప్రయోగాల్లో బిజీ అవుతామని పేర్కొంది. ఇప్పటివరకు జరిగిన ప్రయోగాల ఫలితాలను తాజాగా ఓ జర్నల్‌కి వెల్లడించిన మొడర్నా... 3వ దశ ప్రయోగాల కోసం 30,000 మందిని నియమించుకుంటున్నట్టు తెలిపింది. 
( Also read: COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది )


ఇండియాలో కొవాక్సిన్ పరిస్థితేంటి ? ( Covaxin trials in India ):
ఇండియాలో కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్‌లో దూసుకుపోతున్న భారత్ బయోటెక్.. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ షురూ చేసింది. ఐసిఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ( NIV ) సహకారంతో హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవాక్సిన్ వ్యాక్సిన్‌పైనే ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ( Also read: 
International flights: అంతర్జాతీయ విమానాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ? )


భారత్ బయోటెక్‌తో ( Bharat Biotech ) పాటు జైడస్ క్యడిలా ( Zydus Cadila ) కూడా కరోనావైరస్కి వ్యాక్సిన్‌ని కనిపెట్టే పనిలో బిజీగా ఉంది. ఇటీవలే ప్రీ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ సంస్థ.. తాజాగా హ్యూమన్ ట్రయల్స్‌కి కూడా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ( CDSCO ) నుంచి అనుమతి తీసుకుంది. ఇండియాలో కరోనా వ్యాక్సిన్‌ తయారీ రేసులో భారత్ బయోటెక్ తర్వాత రెండో స్థానంలో ఉన్న కంపెనీ కూడా ఇదే.


( Also read: Covid-19 Vaccine: వ్యాక్సిన్ తయారీలో అమెరికా వేగం )


రష్యాలో వ్యాక్సిన్ తయారీ ( COVID-19 vaccine in Russia ):
రష్యాలో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో ఒకే ఒక సంస్ధ మున్ముందుకు దూసుకుపోతోంది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి జమలీ నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడిమాలజీ అండ్ మైక్రోబయాలజీ ( GNRCEM ) వాళ్లు తయారు చేస్తోన్న వ్యాక్సిన్ జూన్ 18నే తొలి దశ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించింది.


బ్రిటన్‌లో కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీ ( COVID-19 vaccine in Britain ):
బ్రిటన్‌లో యాంటీ
కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీలో రెండు సంస్థలు ముందంజలో ఉన్నాయి. అందులో ఒకటి ఆస్ట్రాజెనికాతో ( AstraZeneca ) కలిసి ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ( Oxfor University ) వాళ్లు రూపొందిస్తున్న వ్యాక్సిన్ కాగా మరొకటి లండన్‌కి చెందిన ఇంపీరియల్ కాలేజ్ ( Imperial College London ) తయారు చేస్తోన్న వ్యాక్సిన్. ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ తయారు చేస్తోన్న వ్యాక్సిన్ ప్రస్తుతం హ్యూమన్ ట్రయల్స్‌లో 3వ దశలో ఉండగా ఇంపీరియల్ కాలేజీ వాళ్లు తయారు చేస్తోన్న వ్యాక్సిన్ 1,2వ ఫేజ్ ట్రయల్స్ జూన్ 15నే ప్రారంభమయ్యాయి. ( Also read: Coronavirus: వ్యాక్సీన్ తయారీలో రష్యా విజయం సాధించిందా ? )


చైనాలో కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీ ఏ దశలో ఉంది ( Chinese vaccines for COVID-19 ) ?
చైనాలో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ విషయానికొస్తే... చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ ( Sinovac Biotech ) అనే సంస్థ బ్రెజిల్‌లో వ్యాక్సిన్‌పై ప్రయోగాలు చేస్తోంది. 3వ దశ ట్రయల్స్ ప్రారంభిస్తున్న ఈ సంస్థ కూడా 
కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్న సంస్థల్లో ఒకటిగా ఉంది. బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో కలిసి కెన్సినో ( CanSino ) అనే బయోటెక్నాలజీ సంస్థ తయారు చేస్తోన్న వ్యాక్సిన్ కూడా ప్రస్తుతం హ్యూమన్ ట్రయల్స్‌లో ఫేస్ 2లో ఉంది.


వుహాన్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి సినోఫార్మ్ సంస్థ తయారు చేస్తోన్న కరోనావైరస్ వ్యాక్సిన్ ( Sinopharm’s COVID19 vaccine ) సైతం 2 దశలో ఉంది. ఇదే సినో‌ఫామ్ సంస్థ బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రోడక్ట్స్ సంస్థతో కలిసి మరో వ్యాక్సిన్‌పై ప్రయోగాలు చేస్తోంది. ప్రస్తుతం దీని ట్రయల్స్ కూడా రెండో దశలోనే ఉన్నాయి.  Also read: Kawasaki Syndrome: కొవిడ్-19 పోనే లేదు భారత్‌లో మరో వ్యాధి కలకలం