Kawasaki Syndrome: కొవిడ్-19 పోనే లేదు భారత్‌లో మరో వ్యాధి కలకలం

Kawasaki Syndrome symptoms: న్యూ ఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తికి ఇంకా మెడిసిన్ రానే లేదు.. కరోనా వ్యాప్తికి ఇంకా చెక్ పెట్టనేలేదు.. అప్పుడే భారత్‌లో మరో కొత్త రకమైన వ్యాధి వ్యాపిస్తుండటం ఆందోళనరేకెత్తిస్తోంది. దానిపేరే కవసాకి సిండ్రోమ్ ( Kawasaki Syndrome ).

Last Updated : Jul 13, 2020, 06:07 PM IST
Kawasaki Syndrome: కొవిడ్-19 పోనే లేదు భారత్‌లో మరో వ్యాధి కలకలం

Kawasaki Syndrome symptoms: న్యూ ఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తికి ఇంకా మెడిసిన్ రానే లేదు.. కరోనా వ్యాప్తికి ఇంకా చెక్ పెట్టనేలేదు.. అప్పుడే భారత్‌లో మరో కొత్త రకమైన వ్యాధి వ్యాపిస్తుండటం ఆందోళనరేకెత్తిస్తోంది. దానిపేరే కవసాకి సిండ్రోమ్ ( Kawasaki Syndrome ). దీనినే మల్టీసిస్టం ఇన్‌ఫ్లేమేటరీ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. ఇప్పటికే వేరంగా వ్యాపిస్తున్న కరోనావైరస్ ( Coronavirus ) కంటిమీద కనుకులేకుండా చేస్తుండగా.. తాజాగా ఈ కవసాకి సిండ్రోమ్ భారతీయులను కలవరపెడుతోంది. ( Also read: India: ఆందోళన పెంచుతున్న కరోనా మరణాలు )

కవసాకి సిండ్రోమ్ లక్షణాల విషయానికొస్తే.. జ్వరంతో పాటుగా రక్త నాళాల్లో ( blood vessels ) మంటగా అనిపించడం, కళ్లు ఉబ్బడం, చర్మం ఎర్రగా మారడం, పొత్తి కడుపు నొప్పి వంటి ఇబ్బందులు ( swollen eyes, reddish skin, abdominal pain ). తలెత్తడం జరుగుతుంది. పిల్లలే అధికంగా ఈ కవసకి సిండ్రోమ్ బారినపడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. కవసాకి సిండ్రోమ్ బారిన పడిన చిన్నారుల్లో రక్త పోటు తగ్గుతుండటం, అకారణంగానే అలసటకు గురవుతుండటం కూడా జరుగుతోంది. ( Also read : Covid19 crime: భార్య శాంపిల్స్..పనిమనిషి పేరుతో )

ఢిల్లీ, ముంబైలలో కవాసాకి సిండ్రోమ్ బారినపడిన చిన్నారుల్లో కొంతమందికి గుండె సంబంధిత ఇబ్బందులు ఎదుర్కున్న వారు కూడా ఉన్నారని బిఎల్ కపూర్ ఆస్పత్రిలో చిన్న పిల్లల వైద్య నిపుణురాలిగా ( Pediatrician ) సేవలు అందిస్తున్న డా రచనా శర్మ చెబుతున్నారు. ప్రస్తుతానికి కవాసాకి సిండ్రోమ్ వేగంగా వ్యాపించనప్పటికీ.. ఈ వ్యాధి సోకిన వారిలో రోగ నిరోధక శక్తి ( Immunity power ) తగ్గిపోతుండటం దృష్ట్యా దీనిని తీవ్రంగానే పరిగణించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ( Also read: COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది )

 

Trending News