Omicron Variant Death: Omicron Variant Death: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron)తో యూకేలో ఒక వ్యక్తి మరణించాడు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) ధృవీకరించారు. ఆదివారం ఒక్కరోజే యూకేలో 1239 ఒమిక్రాన్‌ కేసులు రావడం యూకేలో ఈ వేరియంట్ ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్ లో నవంబర్‌ 27న తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. ఒమిక్రాన్‌ యూకేలో విజృంభిస్తున్న నేపథ్యంలో... బూస్టర్‌ డోసు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సౌతాఫ్రికా(south Africa)లో బయటపడ్డ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్(India)లో కూడా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 38 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, రాజస్థాన్‌, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌, ఏపీ, కేరళలో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. 


Also Read: World Omicron Alert: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్


దేశంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. టీకాలు తీసుకున్నా ఒమిక్రాన్ సోకడం ఆందోళకు గురిచేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ భయాందోళకు గురిచేస్తోంది. ఏపీలోని విజయనగరంలో ఓ వ్యక్తికి పాజిటివ్ తేలింది. దీంతో సర్కారు అప్రమత్తమైంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook