Nobel Prize for Ecomomics 2021: ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి(nobel prize 2021) ఈ ఏడాది ముగ్గురిని వరించింది. అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు డేవిడ్‌ కార్డ్‌, జాషువా డి. ఆంగ్రిస్ట్‌, గైడో డబ్ల్యూ. ఇంబెన్స్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌(Nobel Prize for Ecomomics 2021) అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించింది. అయితే ఇందులో సగం పురస్కారాన్ని డేవిడ్‌ కార్డ్‌(David Card)కు ఇవ్వగా.. మిగతా సగాన్ని జాషువా(Joshua Angrist), గైడో పంచుకోనున్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏయే పరిశోధనలకు లభించిందంటే..
కార్మిక ఆర్థిక అంశాలకు సంబంధించి పరిశోధనాత్మక సహకారం అందించినందుకు గానూ డేవిడ్‌ కార్డ్‌కు నోబెల్ అందిస్తున్నట్లు అకాడమీ వెల్లడించింది. ఇక ఆర్థికశాస్త్రానికి సంబంధించి విశ్లేషణాత్మకమైన పరిశోధనలపై సహకారం అందించినందుకు జాషువా, గైడో(Guid Imbens)లకు కూడా పురస్కారం ఇస్తున్నట్లు తెలిపింది. 


Also read: Nobel Prize in Literature: సాహిత్య రంగంలో టాంజానియా నవలా రచయితకు నోబెల్


సామాజిక శాస్త్రాల్లో ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఉపాధి(Employment), ఉద్యోగుల వేతనంపై వలసవిధానం ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఓ వ్యక్తి సుదీర్ఘ విద్య అతని భవిష్యత్తుపై ఏ మేరకు పనిచేస్తుంది?వలసవిధానం తగ్గడం, వ్యక్తి సుదీర్ఘకాలం చదువుకోకపోవడం ఎలాంటి పరిణామలకు దారితీస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా కష్టం. అయితే ఈ ప్రశ్నలకు తమ సహజ పరిశోధనలతో సమాధానమివ్వొచ్చని శాస్త్రవేత్తలు డేవిడ్‌, జాషువా, గైడో రుజువు చేశారని అకాడమీ వీరిని ప్రశంసించింది. 


Also read: Nobel Prize in Chemistry: రసాయన శాస్త్రంలో బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్ మెక్‌మిల్లన్‌లకు నోబెల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి