Delta Variant Threat: ఆ దేశాల్ని టార్గెట్ చేసిన డెల్టా వేరియంట్, మరోసారి ఆంక్షలు
Delta Variant Threat: కరోనా మహమ్మారిని కట్టడి చేసిన దేశాలకు ఇప్పుడు డెల్టా వేరియంట్ భయం వెంటాడుతోంది. అప్రమత్తమైన ఆ దేశాలు మరోసారి ఆంక్షలు విధిస్తున్నాయి. ముమ్మరంగా వ్యాక్సినేషన్ అందిస్తూనే కట్టుదిట్టమైన ఆంక్షల్ని అమలు చేస్తున్నాయి.
Delta Variant Threat: కరోనా మహమ్మారిని కట్టడి చేసిన దేశాలకు ఇప్పుడు డెల్టా వేరియంట్ భయం వెంటాడుతోంది. అప్రమత్తమైన ఆ దేశాలు మరోసారి ఆంక్షలు విధిస్తున్నాయి. ముమ్మరంగా వ్యాక్సినేషన్ అందిస్తూనే కట్టుదిట్టమైన ఆంక్షల్ని అమలు చేస్తున్నాయి.
కరోనా మహమ్మారి (Corona Pandemic) దెబ్బకు ప్రపంచదేశాలు విలవిల్లాడాయి. ఈ మహమ్మారిని కట్టడి చేయడంలో గానీ, దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో గానీ ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ దేశాలు ముందువరుసలో ఉన్నాయి. అయితే ఇప్పుడీ దేశాల్ని కరోనా సెకండ్ వేవ్‌లో వెలుగుచూసిన డెల్టా వేరియంట్ భయం వెంటాడుతోంది. డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమై..మరోసారి ఆంక్షలు విధించాయి. సిడ్నీలో వారం రోజులపాటు లాక్‌డౌన్ (Lockdown in Sydney)విధించారు. వారం రోజుల పాటు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆస్ట్రేలియాలో గత వారమే 65 పాజిటటివ్ కేసుల్ని గుర్తించారు. అటు ఇజ్రాయిల్ దేశంలో కూడా కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రోజుకు వంద కేసులు వెలుగు చూశాయి. రెండ్రోజుల క్రితం ఒక్కరోజులో 227 కేసులు బయటపడ్డాయి. ఫలితంగా మాస్కుల నిబంధనలో సడలింపుల్ని తొలగించింది. మాస్క్ ధారణను తప్పనిసరి చేసింది. మరిన్ని ఆంక్షల్ని విధించేందుకు సన్నద్ధమవుతోంది.
అటు డెల్టా వేరియంట్ (Delta Variant) కారణంగా ఆఫ్రికా దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటి వరకూ 14 దేశాల్లో ఈ వేరియంట్ తీవ్రంగా ఉందని గుర్తించారు. ఆఫ్రికా ఖండాన్ని కరోనా థర్డ్‌వేవ్ తాకిందని అధికారికంగా ధృవీకరించిన పరిస్థితి. డెల్టా వేరియంట్ ప్రభావం కాంగో, ఉగాండాలో ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కూడా ప్రకటించింది.
Also read: Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం నిందితుడు నీరవ్ మోదీకు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook