Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం నిందితుడు నీరవ్ మోదీకు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ

Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం నిందితుడు, వజ్రాల వ్యాపారీ నీరవ్ మోదీకు మరోసారి చుక్కెదురైంది. హైకోర్టు అప్పీలుకు కోర్టు తిరస్కరించింది. ఫలితంగా ఇండియాకు అప్పగించే మార్గం సుగమం కానుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 24, 2021, 03:29 PM IST
Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం నిందితుడు నీరవ్ మోదీకు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ

Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం నిందితుడు, వజ్రాల వ్యాపారీ నీరవ్ మోదీకు మరోసారి చుక్కెదురైంది. హైకోర్టు అప్పీలుకు కోర్టు తిరస్కరించింది. ఫలితంగా ఇండియాకు అప్పగించే మార్గం సుగమం కానుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో(Punjab National Bank Scam) నిందితుడు నీరవ్ మోదీ. బ్యాంకుకు 13 వేల 5 వందల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి. దేశంలోని ఆర్దిక నేరాల్లో నిందితుడు కావడంతో నీరవ్ మోదీను ఇండియాకు అప్పగించాలని లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు(West Minister Magistrate Court) ఫిబ్రవరిలో ఆదేశాలిచ్చింది. ఇండియాలో మనీ ల్యాండరింగ్, నమ్మకద్రోహం వంటి నేరారోపణల్ని ఎదుర్కోవల్సిందేనని తేల్చిచెప్పింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్..నీరవ్ మోదీను ఇండియాకు అప్పగించేందుకు సమ్మతి తెలుపుతూ..ఏప్రిల్ 15న ఆదేశాలు జారీ చేశారు.ఈ నిర్ణయాన్ని సవాలు చేసేందుకు అవకాశమివ్వాలని నీరవ్ మోదీ హైకోర్టులో అప్పీల్ కోసం అనుమతి పత్రాల్ని దాఖలు చేయగా..కోర్టు వీటీని తిరస్కరించింది. మరో ఐదురోజుల్లో హైకోర్టు(London High Court)లో మరోసారి అప్పీలుకు అవకాశముంది.

ఇండియా నుంచి పారిపోయి లండన్ వీధుల్లో తిరుగుతున్న నీరవ్ మోదీ(Nirav Modi)ను 2019 మార్చ్ 19వ తేదీన యూకే పోలీసులు అరెస్టు చేసి..వాండ్స్‌వర్త్ జైళ్లో ఉంచారు. నీరవ్ మోదీ అప్పీల్ తిరస్కరణకు గురి కావడంతో త్వరలో నీరవ్ మోదీను ఇండియాకు అప్పగించే మార్గం సుగమం కానుంది.  

Also read: H1B Visa: హెచ్ 1 బీ వీసాల్ని అమెరికా రెట్టింపు చేయనుందా..కారణమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News