ఆందోళన కల్గిస్తున్న డెల్టా వేరియంట్ కేసులు, చైనాలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు
Delta Variant: కరోనా మహమ్మారి ఇప్పుడు మరోసారి చైనాను వణికిస్తోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ కేసులు చైనాలో వెలుగు చూడటంతో ఆందోళన అదికమైంది. ఎక్కడికక్కడ లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి.
Delta Variant: కరోనా మహమ్మారి ఇప్పుడు మరోసారి చైనాను వణికిస్తోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ కేసులు చైనాలో వెలుగు చూడటంతో ఆందోళన అదికమైంది. ఎక్కడికక్కడ లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి.
2019 డిసెంబర్ నెలలో చైనా వుహాన్ (Wuhan)నుంచి ప్రారంభమైన కరోనా వైరస్ (Corona Virus)ప్రపంచాన్ని ఇప్పటికీ పట్టి పీడిస్తోంది. అయితే చైనాలో మాత్రం చాలాకాలంగా కరోనా కేసులు జాడ లేదు. ఇప్పుడు మళ్లీ ఆ దేశాన్ని కరోనా మహమ్మారి భయపెడుతోంది. కొత్తగా చైనాలో కరోనా డెల్టా వేరియంట్ కేసులు బయటపడటంతో ఆందోళన అధికమైంది. చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. చైనాలో కొత్తగా 55 కరోనా డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. 20 నగరాలు, పది ప్రావిన్స్‌లలో డెల్టా వేరియంట్(Delta Variant)ఉనికి బయటపడింది. ఫలితంగా డెల్టా వేరియంట్‌ను కట్టడి చేసేందుకు చైనా ఎక్కడికక్కడ లాక్‌డౌన్, ఇతర ఆంక్షల్ని విధిస్తోంది. నాన్‌జింగ్‌లో రష్యా నుంచి వచ్చిన విమానాన్ని శుభ్రం చేసిన 9 మంది ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి డెల్టా వేరియంట్ సోకినట్టు తేలింది. అటు బీజింగ్ వంటి నగరాల్లో కరోనా నిర్ధారణ పరీక్షల్ని భారీగా పెంచారు.
హునాన్ ప్రావిన్స్‌లోని జుజౌ సిటీలో లాక్‌డౌన్ (Lockdown)విధించడంతో 10 లక్షలమంది ఇళ్లకే పరిమితమైంది. బీజింగ్‌లో(Beijing)సైతం డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. ఇతర ప్రాంతాల్ని బీజింగ్‌లోకి పర్యాటకులు రాకుండా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. మరో పర్యాటక ప్రాంతమైన జాంగ్ జీజియాజీలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. చాంగ్‌పింగ్‌లో కూడా గత వారం లాక్‌డౌన్ అమలవుతోంది. కొత్తగా హైనన్, హెనాన్ ప్రావిన్స్‌లలో కొత్త కేసులు బయటపడ్డాయి. కోవిడ్ 19 ఒరిజినల్ వెర్షన్ కంటే డెల్టా వేరియంట్ అత్యధిక వేగంతో సంక్రమిస్తున్నట్టు నిపుణులు ఇప్పటికే గుర్తించిన పరిస్థితి. చైనాకు(China) పొరుగున ఉన్న వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో కూడా డెల్టా వేరియంట్ ప్రభావంగా ఎక్కువగా కన్పిస్తోంది.
Also read: ప్రపంచాన్ని వణికిస్తున్న డెల్టా వేరియంట్‌పై తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook