మాటల్లో చెప్పలేని వేలభావాల్ని ఒకే ఒక్క ఫోటో పలికిస్తుంది. కొన్ని ఫోటోలు చూస్తే పరిస్థితి తీవ్రత చెప్పకనే తెలుస్తుంది. మదిలో చిక్కుకున్న విషాదాన్నిచెబుతుంది. అదే జరిగింది. టర్కీ భూకంపం ( Turkey Earthquake ) ఘోర విషాదానికి సాక్ష్యంగా నిలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గ్రీక్ ( Greece ) దేశాల్ని కకావికలం చేసిన భూకంపం పెనువిషాదాన్నే మిగిల్చింది. రిక్టర్ స్కేల్ ( Richter scale ) పై 7.0 గా నమోదై..జనజీవనాన్ని అస్యవ్యస్థం చేసింది. భూకంపం ధాటికి రెండు దేశాల్లోని తీర ప్రాంత నగరాలు, పట్టణాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. భారీగా దూసుకొచ్చిన రాకాసి అలలు తీరప్రాంతాలను..ముఖ్యంగా ఇజ్మీర్ ( Izmir ) నగరాన్ని ముంచెత్తగా..భారీ అపార్ట్ మెంట్లు నిట్టనిలువుగా కూలిపోయాయి. శిధిలాల్లో సజీవ సమాధయ్యారు. కొందరు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇంకెంతమంది శిధిలాల కింద సమాధయ్యారనేది స్పష్టత లేదు. ఈ విషాదాన్ని కళ్లకు కట్టే వీడియోలు, ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


[[{"fid":"196167","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Dog crying after earthquake","field_file_image_title_text[und][0][value]":"యజమాని కోసం విలపిస్తున్న ఓ శునకం"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Dog crying after earthquake","field_file_image_title_text[und][0][value]":"యజమాని కోసం విలపిస్తున్న ఓ శునకం"}},"link_text":false,"attributes":{"alt":"Dog crying after earthquake","title":"యజమాని కోసం విలపిస్తున్న ఓ శునకం","class":"media-element file-default","data-delta":"1"}}]]


భారీ భూకంపం కారణంగా ఇజ్మీర్ లో భారీ భవనాలు నేలకూలాయి. ఇజ్మీర్ లో కుప్పకూలిన ఓ అపార్ట్ మెంట్  శిధిలాల్లో చిక్కుకుపోయి..సజీవ సమాధైన తన యజమాని కోసం విలపిస్తున్న ఈ శునకం ఫోటో ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది. కంటనీరు తెప్పిస్తోంది.


[[{"fid":"196168","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Dog crying after earthquake","field_file_image_title_text[und][0][value]":"యజమాని కోసం విలపిస్తున్న ఓ శునకం"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Dog crying after earthquake","field_file_image_title_text[und][0][value]":"యజమాని కోసం విలపిస్తున్న ఓ శునకం"}},"link_text":false,"attributes":{"alt":"Dog crying after earthquake","title":"యజమాని కోసం విలపిస్తున్న ఓ శునకం","class":"media-element file-default","data-delta":"2"}}]]


వాసనను బట్టి యజమాని ఎక్కడుందో పసిగట్టింది. కాలితే  కాస్త శిధిలపు మట్టిని తొలగించి చూసింది. నిర్జీవంగా ఉన్న యజమాని చేయి బయటపడింది. ఏం చేయలేని నిస్సహాయత. అటూ ఇటూ చూస్తూ...మౌనంగానే రోదిస్తోంది. వెళ్లిపోయావా నేస్తమంటూ తలదించుకు ఏడుస్తోంది. ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తోంది. ఈ ఫోటోలిప్పుడు వైరల్ అవుతూ అందరికీ కంట నీరు తెప్పిస్తున్నాయి. Also read: Turkey: భారీ భూకంపం, సునామీ..విషాదాన్ని కళ్లకు కట్టే వీడియోలు