Donald Trump announces new US H-1B visa rules: న్యూయార్క్: ఎన్నికలు దగ్గర పడటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి ఆధారిత హెచ్ 1 బీ (H-1B Visa Rules) వీసాల సంఖ్యను తగ్గించడంతోపాటు.. జారీ కార్యక్రమాన్ని మరింత కఠినతరం చేసేలా సరికొత్త ప్రణాళికను ప్రకటించింది ట్రంప్ ప్రభుత్వం. తాజాగా ఇమ్మిగ్రేషన్ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టెక్ కంపెనీలకు తీవ్రనష్టం వాటిల్లనుంది. దీంతోపాటు భారతీయ టెకీల ఉద్యోగాలపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. కరోనావైరస్ (Coronavirus) కారణంగా దేశంలో ఉద్యోగ కల్పన భారమైనందున, వలసలను అరికట్టడం, స్థానికీకరణ, స్థానికుల ఉద్యోగులను రక్షించేందుకు ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని.. మంగళవారం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. Also read: WHO: ఈ ఏడాది చివరి నాటికి.. కోవిడ్ వ్యాక్సిన్!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. ఈ కొత్త విధానం వల్ల అమెరికన్లకు మరింత మేలు కలుగుతుందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ  విభాగం (DHS) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త విసా విధానంతో అమెరికన్ సంస్థల్లో పనిచేయడానికి సంవత్సరానికి 85వేల మంది అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీయులను మాత్రమే నియమించుకునే వీలు కలుగుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాంట్ సెక్యురిటీ ( Department of Homeland Security) పేర్కొంది. అయితే ఈ కొత్త వీసా మార్గదర్శకాలు మరింత కఠినంగా ఉండనున్నాయని డీహెచ్ఎస్ అధికారులు వెల్లడించారు. 



అయితే ఈ కొత్త వీసా ఆంక్షలు రేపటి నుంచే అమలులోకి వచ్చే అవకాశం ఉందనీ యూఎస్ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఏటా వచ్చే హెచ్1 బీ వీసాల దరఖాస్తుల సంఖ్యలో మూడవ వంతు తగ్గవచ్చని డీహెచ్ఎస్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త నిబంధనల ప్రభావం  వీదేశీ ఉద్యోగులు, టెకీ కంపెనీలపై ఎక్కువగా పడనుంది. అయితే తాజా నిబంధనలపై టెక్ సంస్థలు కొర్డుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాయని సమాచారం. ఎందుకంటే..  గతంలో హెచ్1 బీ వీసాలను పరిమితం చేసిన ట్రంప్
సర్కార్ ఆదేశాలను నిలిపివేస్తూ ఫెడరల్ కోర్టులు ఆదేశాలిచ్చాయి. కావున మళ్లీ ఈ కొత్త వీసా విధానంపై టెక్ కంపెనీలు కొర్టు మెట్లెక్కనున్నాయని తెలుస్తోంది. 
Also read: WHO: పది మందిలో ఒకరికి కరోనా.. రాబోయేది మరింత కష్టకాలం!