WHO: ఈ ఏడాది చివరి నాటికి.. కోవిడ్ వ్యాక్సిన్!

కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి. 

Last Updated : Oct 7, 2020, 09:26 AM IST
WHO: ఈ ఏడాది చివరి నాటికి.. కోవిడ్ వ్యాక్సిన్!

COVID-19 vaccine may be ready by year-end: WHO: న్యూఢిల్లీ: కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు రష్యా మినహా.. ఏ వ్యాక్సిన్ ( covid-19 vaccine ) అభివృద్ధి కాలేదు. అయితే కొన్ని వ్యాక్సిన్‌ల క్లినికల్ ట్రయల్స్ రెండు, మూడు దశల్లో విజయవంతంగా ముందుకుసాగుతున్నాయి. ఈ క్రమంలో  ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్  ( WHO ) మంగళవారం ఒక కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరి నాటికే కోవిడ్ 19 వ్యాక్సిన్ సిద్ధంగా ఉండే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ డైరక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ (Tedros Adhanom Ghebreyesus) పేర్కొన్నారు. కరోనావైరస్ కట్టడిపై రెండు రోజులపాటు జరిగిన గ్లోబల్ హెల్త్ బాడీ ఎగ్జిక్యూటివ్ బోర్టు ముగింపు సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ఈ ప్రకటన చేశారు. Also read: WHO: పది మందిలో ఒకరికి కరోనా.. రాబోయేది మరింత కష్టకాలం!

ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ అత్యవసరమని, ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే మార్కెట్లోకి వచ్చిన టీకాల సమాన పంపిణీకి ప్రపంచ నాయకుల సమన్వయం.. రాజకీయ నిబద్ధత అవసరమని టెట్రోస్ పునరుద్ఘాటించారు. వైరస్‌తో పోరాడటానికి అందరూ వనరులను, శక్తిని ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. అయితే.. డబ్ల్యూహెచ్‌ఓ నేతృత్వంలోని కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సిన్ (COVAX global vaccine) పాటు తొమ్మిది వ్యాక్సిన్లు చివరి ప్రయోగ దశలో ఉన్నాయని టెడ్రోస్ చెప్పారు. అవి విజయవంతమయ్యే అవకాశం ఉందని టెడ్రోస్ చెప్పారు. 

ఇదిలా ఉంటే.. ఫైజర్ / బయోఎంటెక్,  ఆస్ట్రాజెనెకా / ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన COVID-19 వ్యాక్సిన్లు ప్రస్తుతం అమెరికా.. ఇతర పాశ్చాత్య దేశాలలో ఆమోదం పొందే మొదటి స్థానంలో ఉన్నాయి. 

Also Read : MLA Love Marriage: హాట్ టాపిక్‌గా ఎమ్మెల్యే ప్రేమ వివాహం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News