Donald Trump Attacks Dr Fauci | యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA ) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు జారాడు. ఆ దేశానికి చెందిన అంటువ్యాధుల నిపుణుడు అయిన ఆంటోని ఫౌచీని ( Dr Fauci ) ఘాటుగా విమర్శించాడు ట్రంప్. కరోనావైరస్ విషయంలో ఆంటోని ఫౌచీ చెప్పినట్టు చేసి ఉంటే ఆ దేశంలో మరణాల సంఖ్య 5 లక్షలకు ఎప్పుడో చేరి ఉండేది అని మండిపడ్డాడు ట్రంప్. అంతే కాకుండా ఫౌచీ ఒక విధ్వంసం ( Dr Fauci Is a Disaster Says Trump ) అని వ్యాఖ్యానించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



అమెరికాలో ఇటీవలే నిర్వహించిన అభిప్రాయ సేకరణలో ట్రంప్ ( Donald Trump ) చాలా వెనకంజ ఉన్నారు అని స్పష్టం అయింది. ఇలాంటి సమయంలో అంటువ్యాధుల నిపుణుడిపై ట్రంప్ వ్యాఖ్యాలు చేయడాన్ని అక్కడి ప్రజలు అంగీకరిచడం లేదు. అంత పెద్ద నిపుణుడిని తిట్టడం సరికాదని కొంత మంది కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి కోవిడ్ -19 వల్ల అమెరికాలో ఇప్పటి వరకు లక్షా 20 వేల మంది మరణించారు. 




మరోవైపు కోవిడ్-19 ( Covid-19 ) మహమ్మారి నివారణకు అక్కడి ప్రభుత్వం విధించిన నియామాలు విసుగుపుట్టించేలా ఉన్నాయని ట్రంప్ కామెంట్ చేశాడు. తమను విసిగించడం ఇక మానేయాలి అని ప్రజలు కోరుకుంటున్నట్టు ట్రంప్ తెలిపారు. కరోనా అదుపులోనే ఉంది కాబట్టి ఇక వదిలేయండి అని ప్రజలు కోరుకుంటున్నట్టు.. ఫౌచీ మాటలను విని ప్రజలు విసుగుచెందారు అని తెలిపారు ట్రంప్.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR