TikTok ban: చైనాపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం..
అమెరికా-చైనాల మధ్య పోరు రోజు రోజుకు పెరగుతోంది. కరోనా మహమ్మారి చైనా నుండే ఉద్భవించిందని ఇప్పటికే అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ ను నిషేధించే దిశగా యోచిస్తోంది.
న్యూఢిల్లీ: అమెరికా-చైనాల మధ్య పోరు రోజు రోజుకు పెరగుతోంది. కరోనా మహమ్మారి చైనా నుండే ఉద్భవించిందని ఇప్పటికే అమెరికా (United States) ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైనాకు చెందిన చైనా యాప్‌లను (china apps) టిక్ టాక్ యాప్ ను నిషేధించే దిశగా యోచిస్తోంది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టతనిచ్చారు. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కరోనా అనేది పెద్ద వ్యాపారమని సంచలన వ్యాఖ్యలు చేశారు. Trump on China: చైనా వల్లే ప్రపంచానికి తీరని నష్టం: ట్రంప్
Also Read: China apps: భారత్ బాటలో అమెరికా.. చైనా యాప్స్ నిషేధం
అమెరికాతో పాటు ప్రపంచం మొత్తానికి చైనా చేసిన పని చాలా అవమానకరమైనదని చెప్పారు. టిక్ టాక్ ను నిషేధించే విషయంపై తమ పరపాలనా విభాగం కసరత్తు చేస్తోందని తెలిపారు. చైనాపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని, అందులో టాక్ టాక్ ను నిషేధించడం కూడా ఒక మార్గమని చెప్పారు. మరోవైపు, ఇప్పటికే టిక్ టాక్ తో పాటు 59 యాప్ లను భారత ప్రభుత్వం (Govt of India) నిషేధించిన సంగతి తెలిసిందే. అదేబాటలో అమెరికా పయనిస్తోంది.
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos