Donald Trump: న్యూఢిల్లీ: కరోనావైరస్ (Coronavirus) విషయంలో అమెరికా, చైనా (usa-china) మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. చైనానే కరోనా వైరస్ మహమ్మారిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిచేసిందని, అది చైనీస్ వైరస్, వుహాన్ వైరస్ అంటూ చాలా సందర్భాల్లో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) బహిరంగంగా ఆగ్రహం వెళ్లగక్కారు. అయితే ఈ సారి ట్రంప్ కరోనా విషయంపై మాట్లాడకుండా చైనా వల్ల జరిగిన నష్టం గురించి ప్రస్తావించారు. చైనా వల్ల అమెరికాతోపాటు ప్రపంచం మొత్తం ఆర్థికపరంగా భారీగా కుదేలయ్యాయని పేర్కొన్నారు.
ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం ట్వీట్ చేశారు. ‘‘చైనా వల్ల అమెరికాతోపాటు ప్రపంచం మొత్తం భారీ నష్టాలను చవిచూశాయి.’’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. Also read: CoronaVirus: గాలితోనూ కరోనా వ్యాప్తి: శాస్త్రవేత్తలు
China has caused great damage to the United States and the rest of the World!
— Donald J. Trump (@realDonaldTrump) July 6, 2020
30లక్షలకు చేరువలో కరోనా కేసులు..
అయితే అమెరికాలో కరోనా వైరస్ (covid-19) నాశనానం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికాలో కరోనా కారణంగా ఇప్పటివరకు లక్షా 32వేల మందికి పైగా మరణాలు సంభవించాయి. వ్యాధి సోకిన వారి సంఖ్య 30లక్షలకు చేరువలో ఉంది. ఇప్పటివరకు సుమారు 13లక్షల మంది కోలుకోగా.. 15లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. Also read: China: భయపెడుతోన్న మరో ప్రాణాంతక బ్యుబోనిక్ ప్లేగ్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..