Dubai suspends Air India Express flights till October 2: న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express ) విమానాలపై దుబాయ్ ప్ర‌భుత్వం 15రోజులపాటు నిషేధం విధించింది. గత రెండువారాల్లో ఎయిర్ ఇండియా విమానాల్లో క‌రోనా పాజిటివ్ స‌ర్టిఫికెట్ ఉన్న ప్ర‌యాణికుల‌ను రెండుసార్లు తీసుకువ‌చ్చినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ (Dubai) ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దుబాయ్ సివిల్ ఏవియేష‌న్ అథారిటీ అధికారులు.. ఎయిర్ ఇండియా స‌ర్వీసుల‌ను అక్టోబ‌రు 2 వ‌ర‌కు నిలిపివేసిన‌ట్లు శుక్రవారం వెల్లడించారు. Also read: Agricultue Bills: 25న భారత్ బంద్!.. మూడు రోజులపాటు రైల్‌రోకోకు పిలుపు


యూఏఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం..  భారత్‌ నుంచి వ‌చ్చే ప్రయాణికులందరూ.. 96 గంట‌ల ముందే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఆ పరీక్షలో నెగిటివ్‌గా నిర్థారణ అయినట్లు ఒరిజినల్ సర్టిఫికెట్ ఉంటేనే దుబాయ్‌ రావడానికి అనుమతి ఉంటుంది. అయితే ఈనెల 4న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ జైపూర్-దుబాయ్ విమానంలో ప్రయాణించిన ఓ వ్య‌క్తి వ‌ద్ద సెప్టెంబర్ 2 తేదీతో కోవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్ ఉందిని అధికారులు తెలిపారు. అంతకుముందు వారం కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని ఈమేరకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసుల‌ను సెప్టెంబ‌ర్ 18 నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు నిలిపివేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అధికారులు వెల్లడించారు.  Also read: Harsimrat Kaur Badal: కేంద్ర మహిళా మంత్రి రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం