Dubai becomes first paperless government in the world: ప్రపంచంలో 100శాతం కాగిత రహిత(paperless) కార్యకలాపాలు నిర్వహిస్తున్న తొలి ప్రభుత్వంగా దుబాయ్ ఎమిరేట్స్(Dubai government) నిలిచింది. ఈ విధానం ద్వారా 350 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు, 14 మిలియన్ల పని గంటలు ఆదా అవుతాయని ఎమిరేట్స్‌ యువరాజు షేక్‌ హమ్‌దాన్‌ బిన్‌ మొహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మఖ్తుమ్‌(Sheikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum) ప్రకటించారు. అంతర్గత, బహిర్గత లావాదేవీలు.. ఫైల్స్‌ బదిలీలు అన్నీ ఇప్పుడు కాగితం ఉపయోగించకుండా డిజిటల్‌(Digital)గా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Harnaaz Sandhu: 21 ఏళ్ల తర్వాత.. మిస్‌ యూనివర్స్‌గా భారత యువతి!!


'‘ఈ లక్ష్యం సాధించడం ద్వారా దుబాయ్‌(Dubai) నిత్య జీవితంలోని అన్ని అంశాలను డిజిటలైజ్‌ చేయడానికి ఒక కొత్త దశకు నాంది పలికినట్లు అయ్యింది. ఆవిష్కరణ, సృజనాత్మకత, భవిష్యత్తుపై దృష్టి సారించే ప్రయాణమిది' ’అని యువరాజు షేక్‌ హమ్‌దాన్‌ వ్యాఖ్యానించారు. డిజిటల్‌ సేవల కోసం అక్కడి ప్రభుత్వం ‘'దుబాయ్‌ నవ్‌'’యాప్‌ను రూపొందించింది. పౌరులకు ఇందులో 12 కేటగిరిల్లో 130 స్మార్ట్‌ సిటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. 




రాబోయే ఐదు దశాబ్దాల్లో దుబాయ్‌లో డిజిటల్ జీవితాన్ని రూపొందించడానికి మరియు మెరుగుపరచడానికి ప్రభుత్వం అధునాతన వ్యూహాలను అమలు చేయాలని యోచిస్తోందని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ చెప్పారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమరేట్స్‌(యూఏఈ) మొత్తం కాగితరహితంగా మార్చేందుకు ఐదు దశల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొదట దుబాయ్‌ కాగితరహిత ప్రభుత్వంగా అవతరించింది. ఐదు దశలు పూర్తయ్యేసరికి అన్ని ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కాగితరహితంగా మార్చేందుకు యూఏఈ(UAE) ప్రభుత్వం కృషి చేస్తోంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి