Earthquake in North India: ఆఫ్ఘాన్ లో భారీ భూకంపం.. వణికిన ఉత్తర భారతం.. 9 మంది మృతి
Earthquake In Delhi: మంగళవారం ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతంతోపాటు పాకిస్తాన్ లోని పలు నగరాలు వణికాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు.
Earthquake In Delhi: ఆఫ్ఘనిస్తాన్‌లో 6.6 తీవ్రతతో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. దీని ధాటికి నార్త్ ఇండియాలోని ప్రధాన నగరాలతోపాటు పాకిస్థాన్ లో కూడా దీని ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ శక్తివంతమైన భూకంపం కారణంగా ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, జైపూర్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్‌లోని వివిధ నగరాల్లోని ప్రజలు తమ ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీసారు. ఇది రాత్రి 10.17 గంటలకు ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతాన్ని వణికించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.
ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 133 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్‌సీఎస్ ట్వీట్‌లో తెలిపింది. ఇస్లామాబాద్, పెషావర్, చర్సద్దా, లాహోర్ మరియు రావల్పిండితో సహా వివిధ పాకిస్తాన్ నగరాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. అయితే ఈ భూకంపం కారణంగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో తొమ్మిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని స్వాత్ లోయ ప్రాంతంలోని వంద మందికిపైగా షాక్ కు గురయ్యారని పాకిస్తాన్ అత్యవసర సేవల ప్రతినిధి బిలాల్ ఫైజీ తెలిపారు.
హిందూకుష్ పర్వత శ్రేణుల్లో ఆప్ఘనిస్థాన్ ఉండటం వల్ల ఆ ప్రాంతం తరుచూ భూకంపాలకు గురవుతుంది. ఈ ప్రాంతంలో భూఅంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల తరుచూ భూకంపాలు ఏర్పడతాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఉత్తరంగా కదులుతూ.. యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్ ను ముందుకు నెడుతోంది. దీని కారణంగా భూకంపాలు ఏర్పడుతున్నాయి.
Also Read: Ecuador Earthquake: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 14 మంది మృతి
Also Read: Ind Vs Aus: రాణించిన బౌలర్లు.. భారత్ లక్ష్యం ఎంతంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి