Elon Musk New Record: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌ సంపాదనలోనే కాదు సంసారంలోనూ తోపుగా ఉన్నాడు. కంపెనీలు, ఆస్తుల విషంలోనే కాదు ఆయన వ్యక్తిగత జీవితంలోనూ రికార్డులు నెలకొల్పుతున్నాడు. వ్యక్తిగత జీవితంలో ఏం రికార్డు సాధించాడంటే 11వ సారి తండ్రి అయ్యాడు. అతడి మూడో భార్య షివాన్‌ జెలీస్‌ మరోసారి బిడ్డకు జన్మించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. అతడికి ఇప్పటికే ముగ్గురు భార్యలు కలిపి 10 సంతానం కలగగా తాజాగా మరో బిడ్డకు జన్మనివ్వడంతో క్రికెట్‌ జట్టంతా సంతానాన్ని మస్క్‌ కలిగి ఉన్నాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Child Marriage: ఒరేయ్ బుద్ధి లేదా..? 72 ఏళ్ల వృద్ధుడితో 12 ఏళ్ల బాలికకు వివాహం.. పోలీసులు దిమ్మతిరిగే ట్విస్ట్


 


ఎక్స్‌ అలియాస్‌ ట్విటర్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ మొదటి భార్య జస్టిన్‌ మస్క్‌. ఆమెకు ఐదుగురు సంతానం కలిగారు. అనంతరం రెండో భార్య మ్యూజిషియన్‌ గ్రిమెస్‌కు ముగ్గురు పిల్లలు. ఇక మూడో సతీమణి షివాన్‌ జెలీస్‌కు గతంలో ఇద్దరు కవల పిల్లలు జన్మించగా.. తాజాగా మరో సంతానం కలిగింది. దీంతో ఆమెకు ముగ్గురు పిల్లలు అయ్యారు. వీరందరినీ కలిపితే మస్క్‌ కుటుంబసభ్యుల సంఖ్య 15 మంది అయ్యారు. 2021లో షివాన్‌ జెలీస్‌కు ఇద్దరు కవలలు అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సందర్భంగా మస్క్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'అధిక సంతానం లేకపోతే నాగరికత కుంగిపోతుంది. నా మాటలు రాసిపెట్టుకోవాలి' అని ప్రకటించాడు. 

Also Read: Lizard Biryani: నిన్న చేతి వేలు, నేడు బల్లి.. ఖంగుతిన్న బిర్యానీ ప్రియుడు


 


అయితే మూడో భార్య షివాన్‌ జెలీస్‌ ఎవరో కాదు మస్క్‌కు చెందిన ప్రముఖ స్పెస్‌ కంపెనీలో ఉద్యోగస్తురాలు. ప్రస్తుతం ఆమె న్యూరాలింక్‌ స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌కు హెడ్‌గా పని చేస్తున్నారు. తన కంపెనీలో పని చేస్తున్న సమయంలోనే జెలీస్‌తో మస్క్‌ శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. అనంతరం కొన్నాళ్లకు రహాస్య వివాహం చేసుకున్నాడు. తన సంస్థ ఉద్యోగస్తులతో మస్క్‌ కోరికలు తీర్చుకుంటుంటాడు. వీలైనంత ఎక్కువ మంది పిల్లలు కనాలని ఒక లక్ష్యంగా మస్క్‌ పెట్టుకున్నాడు. అధికారికంగా ముగ్గురు భార్యలు కాగా.. అనధికారికంగా మస్క్‌ కంపెనీలోని మరికొందరితో రాసలీలలు కొనసాగిస్తున్నారని అంతర్జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇద్దరితో ఆయన సంబంధాలు నెరుపుతున్నట్లు ప్రపంచ మీడియా చెబుతోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter