Lizard Biryani: నిన్న చేతి వేలు, నేడు బల్లి.. ఖంగుతిన్న బిర్యానీ ప్రియుడు

Lizard Found In Biryani At Guntur Arundalpet: తినే పదార్థాల్లో జంతువులు, పనిముట్లు, మానవ శరీర అవశేషాలు కనిపిస్తున్నాయి. మొన్న ఐస్‌క్రీమ్‌లో చేతి వేలు కనిపించగా.. తాజాగా బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 14, 2024, 08:23 PM IST
Lizard Biryani: నిన్న చేతి వేలు, నేడు బల్లి.. ఖంగుతిన్న బిర్యానీ ప్రియుడు

Lizard Biryani: హోటళ్ల నిర్వాహకులు మారడం లేదు. శుచీ శుభ్రత పాటించకుండా వండి వడ్డిస్తుండడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. హోటల్‌లో ఆహారం తిని అస్వస్థతకు గురవుతున్న సంఘటనలో దేశంలో నిత్యం చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల అయితే ప్రాణాలు కూడా పోతున్నాయి. అయినా కూడా హోటళ్ల నిర్వాహకులు తమకు వచ్చిన నష్టమేమి లేదని అదే తరహాలో వంటలు వండుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా బిర్యానీ ఆర్డర్‌ పెట్టుకోగా అందులో బల్లీ ప్రత్యక్షమైంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Also Read: Human finger: ఐస్ క్రీమ్ లో బైటపడ్డ మనిషి వేలు.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

గుంటూరు పట్టణంలోని అరండల్‌పేటలో ఓ బిర్యానీ పాయింట్‌ ఉంది. అక్కడ ఓ వ్యక్తి వచ్చి బిర్యానీ పార్సిల్ తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఇష్టమైన బిర్యానీ కావడంతో తినేందుకు ఉపక్రమించగా షాక్‌కు గురయ్యాడు. తింటున్న క్రమంలో బిర్యానీలో చనిపోయిన బల్లి కనిపించింది. అది చూసి వాంతులు చేసుకునే పరిస్థితికి వచ్చింది. సాధారణంగా బల్లిని చూస్తేనే వెగటు పుడుతుంది. అలాంటిది తినే పదార్థంలో వస్తే ఆ పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు.

Also Read: King Cobra: హైదరాబాద్‌ రోడ్లపై తాచుపాము హల్‌చల్‌.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

 

వెంటనే ఆగ్రహంతో బిర్యానీ పాయింట్‌కు వెళ్లాడు. బల్లి వచ్చిందని నిలదీయగా ఆ నిర్వాహకులు ఎదురు తిరిగారు. బాధితుడితో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలుస్తుందనే భయంతో నిర్వాహకులు దుకాణం మూసి వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని బాధితుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడి
కాగా తెలంగాణలో హోటళ్లు, రెస్టారెంట్లు, చాట్‌ భండార్‌, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఎదురైన పరిస్థితులు గుర్తించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు ప్రారంభించారు. విజయవాడలోని ఓ ప్రముఖ బేకరీపై దాడులు చేయగా.. కాలం చెల్లించిన పదార్థాలు, అపరిశుభ్రమైన వాతావరణంలో వంటలు తదితర కనిపించాయి. దీంతో బేకరి నిర్వాహకులపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే దాడులు, తనిఖీలు చేస్తున్నా కూడా హోటళ్ల నిర్వాహకులల్లో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News