Elon Musk: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆప్ఘన్‌లో తాలిబన్ల ఆకృత్యమే చర్చనీయాంశమైంది. అయితే ప్రపంచ బిలియనీర్, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌కు మాత్రం మరో అంశం ప్రాధాన్యతగా కన్పించింది. తాలిబన్ల ఆకృత్యం కాకుండా వేరే అంశంపై స్పందించడం విశేషంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌(Afghanistan)ను ఆక్రమించడంతోనే పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. తాలిబన్లపై భయంతో అక్కడ్నించి బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఒక్కొక్కటిగా తాలిబన్ల ఆకృత్యాలపై వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల వ్యవహారంపై చర్చ సాగుతుంటే..ప్రపంచ విఖ్యాత బిలియనీర్, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌కు మాత్రం మరో అంశం ప్రాధాన్యతగా కన్పించింది. తాలిబన్లను వారు చేస్తున్న ఆకృత్యాలపై ప్రశ్నించాల్సింది పోయి..మరో అంశంపై ప్రశ్నించడం విశేషంగా మారింది.


తాలిబన్లు(Talibans)ఓ పదిమంది ఓచోట దిగిన ఫోటోను ఎలన్ మస్క్ షేర్ చేశారు. ఆ ఫోటోలో తాలిబన్లు మాస్క్ ధరించిలేరు. దాంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ గురించి తాలిబన్లకు తెలియదా, దాని గురించి వినలేదా అని ట్విట్టర్ వేదికగా తాలిబన్లను ఎలన్ మస్క్(Elon Musk) ప్రశ్నించారు. దాంతో ఈ ఫోటో బాగా వైరల్ అవుతోంది. నిజమేనా..మీరు ఆ అంశంపై తాలిబన్లను విమర్శిస్తున్నారా, యూఎస్ 20 ఏళ్ల పాటు చేయలేనిది..తాలిబన్లు 19 రోజుల్లో చేసిందాని గురించి కాదా..ఈ అంశం అంత ప్రాధాన్యత లేనిదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో డెల్టా వేరియంట్‌కు ప్రాధాన్యత లేదని నేను భావిస్తున్నానంటూ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. 


Also read: Cocaine: పొట్ట విప్పి చూడ...పదకొండు కోట్ల కొకైన్, నమ్మలేకున్నారా...నిజమే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook