ఫేస్‌బుక్ ఉద్యోగులకు కరోనా బోనస్ ప్రకటించిన Mark Zuckerberg
ప్రాణాంతక కరోనా వైరస్ నేపథ్యంలో ఫేస్ బుక్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి శ్రమను గుర్తించి, మరింత ప్రోత్సహించడంలో భాగంగా జుకర్ బర్గ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
శాన్‌ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తమ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ ఉద్యోగులకు కరోనా వైరస్ (CoronaVirus) బోనస్ అందించనున్నట్లు సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మంగళవారం ప్రకటించారు. 45,000 మంది కంపెనీ ఉద్యోగులకు ఆరు నెలల బోనస్ సహా అదనంగా 1,000 డాలర్ల మేర బోనస్ అందించనున్నారు. అమెరికాకు చెందిన వర్క్ డే అనే ఫైనాన్షియల్ సంస్థ రెండు వారాల వేతనాన్ని కంపెనీ ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన నేపథ్యంలో ఫేస్‌బుక్ భారీగా బోనస్ ప్రకటించడం గమనార్హం.
భారత ఆర్మీలో తొలి Coronavirus పాజిటీవ్ కేసు
ప్రాణాంతక కరోనా వైరస్ (COVID-19) నేపథ్యంలో Facebook ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి శ్రమను గుర్తించి, మరింత ప్రోత్సహించడంలో భాగంగా జుకర్ బర్గ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. నిత్యం పిల్లలకు దూరంగా ఉంటూ ఆఫీసు కోసం ఎంతో శ్రమిస్తున్న ఉద్యోగులకు ఇలాంటి సమాయాల్లో బోనస్ ప్రకటించడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందని భావిస్తున్నట్లు సీఈఓ జుకర్ బర్గ్ ఉద్యోగులకు రాసిన లేఖలో వెల్లడించారు. ఇంట్లో కాస్త ఆఫీసు వాతావరణం కల్పించుకోవడంలో ఉద్యోగుల ఇబ్బందులు తొలగించడానికి బోనస్ ప్రకటించారు.
Read also : కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?
కాగా, కరోనా వైరస్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఫిబ్రవరి 27న నిర్వహించాల్సిన వార్షిక సాఫ్ట్‌వేర్ డెవలపర్ల సమావేశాన్ని సైతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న కారణంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా మంచి ప్రయోజనాలు అందుతాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
నాభి అందాలతో వర్మ హీరోయిన్ రచ్చరచ్చ!
కరోనా కథనాల కోసం క్లిక్ చేయండి