భారత ఆర్మీలో తొలి Coronavirus పాజిటీవ్ కేసు

ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8వేల ప్రజలు మృత్యువాతపడ్డారు. అధికారికంగా మాత్రం మంగళవారం నాటికి 7,866 మంది కరోనా సోకి చనిపోయారని ప్రకటించారు.

Last Updated : Mar 18, 2020, 09:55 AM IST
భారత ఆర్మీలో తొలి Coronavirus పాజిటీవ్ కేసు

న్యూఢిల్లీ: భారత ఆర్మీలో తొలి కరోనా వైరస్ (CoronaVirus) పాజిటీవ్ కేసు నమోదైంది. దీంతో ఆర్మీ అధికారులు అప్రమత్తమయ్యారు. లేహ్ ప్రాంతానికి చెందిన సైనికుడికి కోవిడ్19 పాజిటీవ్ అని తేలింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు ఆ సోల్జర్ సెలవులపై వెళ్లారు. ఇరాన్‌కు వెళ్లి వచ్చిన ఆయన తండ్రితో కలిసి ఉండటంతో కరోనా వ్యాపించి ఉండొచ్చునని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సైనికుడి తండ్రికి కరోనా సోకిందా లేదా అన్నదానిపై సమాచారం లేదు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం భారత్ రెండో దశలోనే ఉందని కరోనా విషయంలో మూడో దశకు చేరుకోలేదు. ఐసీఎంఆర్ దేశ వ్యాప్తంగా 72 ల్యాబోరేటరీలలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ వారాంతానికి మరో 49 ల్యాబోరేటరీలు అందుబాటులోకి తెస్తామని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. కాగా, కరోనా వైరస్ బారిన పడి భారత్‌లో ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. 

ప్రాణాంతక కరోనా వైరస్  బారినపడి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8వేల ప్రజలు మృత్యువాతపడ్డారు. అధికారికంగా మాత్రం మంగళవారం నాటికి 7,866 మంది కరోనా సోకి చనిపోయారని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా మరో 1,87,689 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 137కి చేరుకుంది. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేత, మ్యాచ్‌ల నిలిపివేత, ఉద్యోగులకు ఇంటి వద్ద నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) కల్పించడంతో పాటు అధికారులు జాగ్రత్తలు సూచిస్తున్నారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

 

Trending News