Facebook changes its company name to Meta, here's why: ఫేస్‌బుక్ కంపెనీ పేరు మార్చుతున్నట్లు ఆ కంపెనీ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. తాజాగా జరిగిన కంపెనీ వార్షిక సదస్సులో జుకర్‌బర్గ్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఫేస్‌బుక్‌తో పాటు కంపెనీకి చెందిన ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ఇన్‌స్టాగ్రాం, (Instagram) మెసేంజర్‌, వాట్సాప్‌ (WhatsApp) పేర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని కంపెనీ తెలిపింది. ఫేస్‌బుక్‌కు (Facebook) చెందిన అన్ని కంపెనీలకు మెటా మాతృసంస్థగా ఉండబోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫేస్‌బుక్‌ కార్పొరేట్‌ పేరు మెటాగా ("Meta") రూపాంతరం చెందనుంది. ఇక మెటా కొత్తలోగో ఆవిష్కరణ కూడా జరిగింది. ఇంతకుముందు ఫేస్‌బుక్‌ (Facebook) కింద కొనసాగిన సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు ఇకపై మెటా కింద కొనసాగుతాయి. అంటే మాతృసంస్థ పేరుమాత్రమే మారింది తప్ప, దానికింద ఉండే సోషల్ మీడియా సేవలన్నీ కూడా పాత పేర్లతోనే కొనసాగుతాయి.


Also Read : Nagarjuna meets CM Jagan: ఏపీ సీఎం జగన్‌తో నాగార్జున భేటీ
 
ఇక గత కొంత కాలంగా ఫేస్‌బుక్ వ్యక్తిగత ప్రయోజనాలు లక్ష్యంగా యూజర్ డేటాను (User data) ట్రాక్‌ చేస్తుందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాతో పాటు పలు దేశాల్లో ఫేస్‌బుక్ న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. దీంతో ఫేస్‌బుక్ పేరు తరచుగా వార్తల్లో రావడం యూజర్లపై ప్రభావం చూపిస్తోందని కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌కి చెందిన అన్ని కంపెనీలను ఒకే కొత్త కంపెనీ కిందకు తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. అందులోభాగంగానే ‘మెటా’ (Meta) కంపెనీ పేరును ప్రకటించారు.


అలాగే ‘మెటావర్స్‌’లో (metaverse) భాగంగా పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు జుకర్‌బర్గ్‌ (Zuckerberg) తెలిపారు. వర్చువల్‌ రియాలిటీ స్పేస్‌లో రానున్న కాలంలో వినియోగదారులు ఎలాంటి అంతరాయం లేని అత్యున్నత స్థాయి సాంకేతిక సేవల వినియోగం, తదితర అంశాలు ‘మెటావర్స్‌’ పరిధిలోకి వస్తాయి. యాప్స్‌ నుంచి మరింత సాంకేతిక పరిపక్వత కలిగిన మెటావర్స్‌ దిశగా మెటా అడుగులు వేస్తుందని జుకర్‌బర్గ్‌ స్పష్టం చేశారు. ‘ఒకరికి ఒకరిని కలిపి ఉంచడానికి సాంకేతికతను ఆవిష్కరించే కంపెనీ మనది. మన సాంకేతికతలో ప్రజలను ఒక చోటు కేంద్రీకరించవచ్చు. తద్వారా అందరూ కలిసి ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతికి దోహదపడవచ్చు’’ అని జుకర్‌బర్గ్‌ తెలిపారు. ప్రస్తుత బ్రాండ్‌ ఇకపై మనకు కావాల్సిన సేవల అన్నింటినీ అందించలేకపోవచ్చు.. ఈ దిశలోనే మన సంస్థ బ్రాండ్‌ పేరు (Brand name) మారింది అని ఆయన పేర్కొన్నారు. అలాగే జుకర్‌బర్గ్‌ (Zuckerberg) గత కొద్దిరోజులుగా మెటావర్స్‌ సాంకేతికతపై దృష్టి పెట్టారు. ఇప్పటికే వేలాది మందిని దీనికోసం నియమించుకున్నారు.


Also Read : Corona Updates: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కొవిడ్ భయాలు- రష్యా, చైనాలో కొత్త కేసుల కలవరం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook