Facebook Name Change: ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్బుక్. ప్రతి ఒక్కరికీ సుపరిచితమైన పేరంటే అతిశయోక్తి లేదు. ఇప్పుడు త్వరలో ఫేస్బుక్ పేరు మార్చుకోనుందనే వార్తలు వెలువడుతున్నాయి. ప్రముఖ టెక్ పత్రిక ది వైర్ ఈ మేరకు ఓ కధనం ప్రచురించింది. ఎంతవరకూ నిజం ఇది.
సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్‌కు(Facebook)సంబంధించి కీలకమైన సమాచారం వస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమ వేదికల్లో ఫేస్బుక్ దిగ్గజ సంస్థ. ఫేస్‌బుక్‌కు అనుబంధంగానే వాట్సప్, ఇన్స్టాగ్రామ్ సేవలు అందుతున్నాయి. ఇటీవల మెటావర్స్‌పై దృష్టి పెట్టి ఆ దిశగా ఆలోచనలు చేస్తున్న ఫేస్బుక్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg)ఇటీవల కీలక ప్రకటన చేశారు. సీఈవో పదవీ బాథ్యతల నుంచి తాను త్వరలో తప్పుకోనున్నట్టు సంకేతాలిచ్చారు. ఇప్పుడు మరో కీలకమైన అంశం ఆ సంస్థకు సంబంధించి టాక్ విన్పిస్తోంది. త్వరలో ఫేస్బుక్ తన పేరును మార్చుకోనుందనేది ఆ వార్త. ఆశ్చర్యంగా ఉందా..నిజమే. ప్రముఖ టెక్ పత్రిక ది వైర్ ఈ మేరకు ఓ కథనం ప్రచురించింది.ఫేస్బుక్ మాత్రం ఈ విషయమై ఎటువంటి ధృవీకరణ చేయలేదు.
ఫేస్బుక్ సంస్థ పేరు మార్చుకుని(Facebook to change its name) కొత్త పేరుతో రీబ్రాండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆ కధనం సారాంశం. అక్టోబర్ 28వ తేదీన జరిగే కంపెనీ వార్షిక సదస్సులో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg)పేరు మార్పు గురించి మాట్లాడే అవకాశాలున్నాయి. అంతకంటే ముందే అధికారిక ప్రకటన కూడా రావచ్చు.ఫేస్బుక్ వ్యాపార కార్యకలాపాలపై అమెరికా ప్రభుత్వం నుంచి న్యాయపరమైన ఇబ్బందులు పెరుగుతున్న నేపధ్యంలో కంపెనీ పేరు మార్పుపై వార్తలు రావడం ఆసక్తి రేపుతోంది. వివాదాలు తలెత్తిన ప్రతిసారీ ఫేస్బుక్ పేరు వార్తల్లోకెక్కడం వల్ల యూజర్ల సంఖ్యపై విపరీతమైన ప్రభావం చూపిస్తోందని కంపెనీ భావన. అందుకే కొత్త పేరుతో రీబ్రాండ్ చేస్తే కాస్త ఉపశమనం లభిస్తుందనేది కంపెనీ ఆలోచనగా ఉందట. అదే సమయంలో ఫేస్బుక్ అంటే కేవలం సోషల్ మీడియా అనే అభిప్రాయాన్ని తొలగించుకోవాలనేది ఆ సంస్థ ఆలోచన. పేరు మార్చడం(Facebook to renameవల్ల ఫేస్బుక్ యూజర్లపై నేరుగా ఏ విధమైన ప్రభావమైతే ఉండదు. కంపెనీ మాతృసంస్థ పేరును మార్చి..ఆ సంస్థ కింద ఫేస్బుక్ చేర్చాలనేది ఆలోచనగా ఉంది. వాట్సప్(Whatsapp), ఇన్స్టాగ్రామ్(Instagram), ఒకులస్లను కూడా ఈ కొత్త పేరెంట్ కంపెనీ కిందకు తీసుకురానున్నారు. రీబ్రాండ్ చేస్తే ఏం పేరు పెడతారనేది ఇంకా స్పష్టత లేదు. టెక్ కంపెనీలు సేవల్ని విస్తరించినప్పుడు బ్రాండ్ పేరు మార్చుకోవడం సహజ పరిణామమే. గతంలో 2015లో గూగుల్(Google)సంస్థ..ఆల్ఫాబెట్ ఏర్పాటు చేసి మాతృక సంస్థగా చేసింది. అందుకే ఇప్పుడు ఫేస్బుక్ పేరు మార్పుపై వస్తున్న వార్తల్ని అధికారికంగా ఆ సంస్థ ధృవీకరించకపోయినా..వాస్తవం అయుంటుందని భావిస్తున్నారు.
Also read: Realme Launched New Mobiles: రియల్మీ నుంచి ఒకేసారి రెండు ఫోన్లు.. ఫీచర్లు అదిరిపోయాయిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి