Fact check: ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆర్మీలో చేరి యుద్ధం చేస్తున్నారా? ఆ ఫొటోల్లో నిజమెంత?
Ukrainian President Volodymyr Zelensky in military uniform: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జలన్‌స్కీ ఆర్మీ దుస్తులు ధరించి రష్యాపై యుద్ధం చేస్తున్నారని కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో నిజమెంత ? ఈ ఫొటోలు చూసిన నెజిజన్లు జెలన్స్కీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్ట కాలంలో అన్నీ తానై ముందున్నాడంటూ.. పొగుడుతున్నారు.
Ukrainian President Volodymyr Zelensky in military uniform: రష్యా-ఉక్రెయిన్ ఆందోళనలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్ తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తూనే.. రష్యాపై ఎదురు దాడి చేస్తోంది. ఏ క్షణమైనా రష్యా ఉక్రెయిన్‌పై పట్టు సాధించొచ్చని అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ తరఫున పొరాడేందుకు ఏ దేశం ముందుకు రావడం లేదు. పెద్దన్న అమెరికా కూడా ఆంక్షలు, మాటలతోనే సరిపెడుతోంది తప్పా యుద్ధంలోకి మాత్రం దిగటం లేదు. అయినప్పటికీ ఉక్రెయిన్ ఎదురుదాడులు మాత్రం ఆపేది లేదని స్పష్టం చేసింది.
అయితే పరిస్థితులు అదుపు తప్పేలోపే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జలన్స్కీని కీవ్ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని అమెరికా ఆఫర్ ఇచ్చింది. ఆ ఆఫర్‌ను ఆయన తిరస్కరించారు. దేశంలో ఉండే పోరాడుతానని తెల్చి చెప్పారు. దీనితో ఆయన నిర్ణయంపై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన నాయకుడి లక్షణం అదే అని ఉక్రెయిన్ ప్రజలు కీర్తిస్తున్నారు. అసలు విషయం తెలియని యావత్ ప్రపంచం సైతం అతన్ని ఆకాశానికెత్తుతోంది. కానీ అసలు విషయం వేరే ఉంది.
ఆర్మీ యూనిఫాం జలన్‌స్కీ..
అయితే ఇప్పుడు ఇంకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన సైన్యాన్ని ముందుండి నడిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన సైనిక దుస్తులు ధరించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఆ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసిన ఓ వ్యక్తి.. 'ఈయన ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఆయన మిలిటరీ బట్టలు ధరించి.. సైన్యంలో చేరారు. ఉక్రెయిన్ను రక్షించుకునేందుకు పోరాటం చేస్తున్నారు. నిజమైన నాయకుడంటే ఇతనే' అని రాసుకొచ్చారు.
ఈ ఫొటోను మరో వెరిఫైడ్ ట్విట్టర్ యూజర్ కూడా షేర్ చేయడం గమనార్హం. ఈ ఫొటోలు చూసిన నెజిజన్లు జెలన్స్కీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్ట కాలంలో అన్నీ తానై ముందున్నాడంటూ.. పొగుడుతున్నారు.
ఆ వార్తల్లో నిజమంతే ?
అయితే ఇది ఎంతవరకు నిజమని పరిశీలించగా.. ఆ ఫొటోలు నిజమైనవే గానీ.. ఇప్పటివి కాదని తేలింది. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆధారంగా.. ఆ ఫొటోలన్నీ గత 2021లో దిగినట్లు తెలిసింది. కాబట్టి ఇప్పుడు జెలన్స్కీ ఆర్మీ దుస్తులు ధరించి యుద్ధం చేస్తున్నారని వస్తున్న వార్తలు అవాస్తవంఅని స్పష్టమైంది. ట్విట్టర్ ఫ్యాక్ట్ చెక్ కూడా ఇది తప్పుడు వార్త అని ధృవీకరించింది. ఆ ఫొటోలన్నీ.. గత ఏడాది ఆర్మీ అధికారులతో సమావేశం సందర్భంగా జెలన్స్కీ కూడా ఆర్మీ దుస్తులు ధరించి వెళ్లారు. అప్పట్లో దిగిన ఫొటోలను ఇప్పటి పరిస్థితులకు జోడించి కొంత మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Also read: Russia-Ukraine war: రొమానియా నుంచి ముంబయికు బయల్దేరిన విమానం.. ఫ్లైట్ లో 219 మంది భారతీయులు..
Also read: Russia Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా చర్యలపై UN భద్రతా మండలిలో ఓటింగ్.. భారత్, చైనా దూరం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook