Fact check:  ఓ వైపు కరోనా వైరస్‌తో జనం వణికిపోతుంటే..మరోవైపు కొత్త కరోనా వైరస్ విజృంభిస్తుంటే..వ్యాక్సిన్‌తో ప్రమాదమంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) తీసుకున్న రోగులు ఇతర పేషెంట్లను తినేస్తున్నారు..దాంతో ఆసుపత్రులకు తాళాలు పడుతున్నాయి అంటూ  వార్తలు జనాల్ని కలవరపెడుతున్నాయి. లాంస్ ఏంజెల్స్‌ ( Los angeles ) లో జరిగినట్టుగా ఓ ఫోటో కూడా చక్కర్లు కొడుతోంది. ఓ ప్రముఖ మీడియా ఈ వార్తను ప్రసారం చేసినట్టుగా మార్ఫింగ్ చేశారు. ప్రముఖ మీడియా లోగో చూసి..నిజమే అనుకుని ఇతరులకు షేరింగ్ చేస్తున్నారు. 


వ్యాక్సిన్ తీసుకుంటే మనుషులు జాంబీలుగా ( Zombies ) మారిపోతున్నారని..ఇతరుల్ని తింటున్నారని అర్ధం పర్ధం లేని వార్తలు వస్తున్నాయి. అమెరికాలోని ఉత్తర  ఫిలడెల్ఫియా ( North Philadelphia ) లో టెంపుల్ యూనివర్శిటీ ఆసుపత్రిలో బుల్లెట్లకు గురైన బాధితులకు వైద్యం చేస్తుండగా తీసిన ఫోటోను మార్ఫింగ్ చేసి ప్రసారం చేస్తున్నారిలా. ఈ ఫోటో కూడా ఇప్పటిది కాదు. గత ఏడాది ఫిబ్రవరి నాటిది. అప్పటి ఫోటోను మార్ఫింగ్ చేసి కరోనా వ్యాక్సిన్‌తో లింక్ పెట్టి ఇలా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 


వ్యాక్సిన్ తీసుకుంటే నరమాంసం తినే జాంబీలుగా మారిపోతున్నారంటూ వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధం..ఇందులే నిజం లేదు. ఇలాంటి వార్తల్ని నమ్మవద్దు. ఇతరులకు షేర్ కూడా చేయవద్దు.


Also read: Farmers protest: అమెరికాను తాకిన భారత రైతుల నిరనస సెగ