Failure to recognise government can create problems for the world, Taliban warn US: తమ పాలనను అధికారికంగా గుర్తించాలని తాలిబన్లు అమెరికా సహా ఇతర దేశాలను కోరారు. అలాగే వివిధ దేశాల్లో స్తంభించిపోయిన నిధులను విడుదల చేయాలన్నారు. అఫ్గాన్‌ (Afghan) ఆస్తులపై ఆంక్షలు ఎత్తివేయలన్నారు. లేదంటే ఇది మున్ముందు అంతర్జాతీయ సమస్యగా పరిణమించే అవకాశం ఉందంటూ తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ (Taliban spokesman Zabihullah Mujahid) హెచ్చరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చివరిసారి అమెరికా, తాలిబన్ల (Taliban) మధ్య సరైన దౌత్యసంబంధాలు లేకపోవడం వల్లే యుద్ధం తలెత్తిందని ముజాహిద్‌ పేర్కొన్నారు. చర్చల వల్ల అప్పుడే సమస్యలు పరిష్కారమై ఉండేవని వ్యాఖ్యానించారు. తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తించడం అఫ్గాన్‌ ప్రజల హక్కు అని పేర్కొన్నారు.


ఇక అఫ్గాన్‌లో అధికారంలోకి వచ్చిన తాలిబన్లు.. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు ఏ దేశమూ అధికారికంగా వారి పాలనను గుర్తించలేదు. పైగా ఆయా దేశాల్లో ఉన్న అఫ్గాన్‌ (Afghan) ఆస్తులు, నిధులను స్తంభింపజేశారు. దీంతో అఫ్గాన్‌ ప్రజలు తీవ్ర కరవుకాటకాలతో ఇబ్బందులుపడుతున్నారు. 


Also Read : Whats App Cash Back: వాట్సాప్ పేమెంట్స్‌లో రూ. 255 క్యాష్‌బ్యాక్‌..త్వరపడండి!


అఫ్గాన్‌లో (Afghan) ఆర్థిక, మానవతా సంక్షోభం నెలకొంది. ఈ తరుణంలో చేసేది లేక తాలిబన్లు గుర్తింపు కోసం ప్రపంచ దేశాలకు విజ్ఞప్తులు చేస్తున్నారు.తాలిబన్‌ ప్రభుత్వంతో పాకిస్థాన్‌, చైనా మాత్రం సఖ్యతగా ఉంటున్నాయి. 


కొన్నిరోజుల క్రితం చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ (China's foreign minister, Wang Yi) కతార్‌లో తాలిబన్‌ ప్రతినిధులతో చర్చలు చేపట్టారు. చైనాలోకి పాకిస్థాన్ (Pakistan) మీదుగా ఎగుమతులకు వాంగ్‌ యీ హామీ ఇచ్చినట్లు ముజాహిద్‌ తెలిపారు. అలాగే అఫ్గాన్‌లో (Afghan) రవాణా మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయం అందజేసేందుకు చైనా (China) అంగీకరించింది.


Also Read : Huzurabad byelection: 'ఉప ఎన్నికలో విజయం కోసం టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు డబ్బులు పంచారు'


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి