Trump House: ఫ్లోరిడాలోని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన మార్-ఏ-లాగో ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) తనిఖీలు చేస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశ రహస్య పత్రాలు ఇంటికి తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది. ఈవిషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించలేదు. ఐతే ట్రంప్ కుటుంబసభ్యులు మాత్రం తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ట్రంప్ ఇళ్లు అధికారుల నిఘాలో ఉంది. ఇంటిలో అనువనువు జల్లెడ పడుతున్నారు. సీక్రెట్ వారెంట్ అధికారులకు ఎఫ్‌ఐ అధికారులు తనిఖీల పత్రాన్ని అందజేశారు. ఈవిషయాన్ని ట్రంప్ కుమారుడు ఎరిక్ వెల్లడించారు. తమ ఇంటికి వచ్చిన వారంతా ఎఫ్‌బీఐ అధికారులు కాదని..శ్వేత సౌధం నుంచి వచ్చారని ఆయన ఆరోపించారు. కక్షసాధింపుగానే బైడెన్ పంపారని మండిపడ్డారు.


గతంలో ట్రంప్ ఇంట్లో కీలక పత్రాలు లభించాయి. దీనిపై ఆయన కుమారుడు స్పందించారు. శ్వేత సౌధం ఖాళీ చేసే క్రమంలో ఇవి పెట్టెలో ఉండిపోయాయని తెలిపారు. అక్కడ నుంచి తమ ఇంటికి వచ్చేందుకు ఆరు గంటల సమయం మాత్రమే ఉందని..ఈక్రమంలో అలా జరిగిందని వివరించారు. మార్-ఏ-లాగో ఎస్టేట్‌లో తనిఖీలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.


మార్-ఏ-లాగో ఎస్టేట్‌ను ఎఫ్‌బీఐ అధికారులు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. ఇది దేశానికి చీకటి రోజు అని అభిప్రాయపడ్డారు. దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తున్నామని..ఐనా అనవసర దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈక్రమంలో మళ్లీ దాడులు జరడం కలకలం రేపుతోంది.


ప్రస్తుతం ఆయన న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్స్‌లో నివసిస్తున్నారు. మార్-ఏ-లాగో ఎస్టేట్‌ను డొనాల్డ్ ట్రంప్ 1985లో 10 మిలియన్ డాలర్లకు తీసుకున్నారు. ప్రస్తుతం దీని విలువ 180 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. శీతాకాలం విడిది కోసం దీనిని ట్రంప్ కుటుంబసభ్యులు ఉపయోగిస్తుంటారు.


Also read:Corona Updates in India: దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు..ఇవాళ్టి కరోనా కేసులు ఇవే..!


Also read:Rajinikanth: రాజకీయాల్లో రజనీకాంత్ ఎంట్రీ ఖాయమేనా..తాజాగా ఆయన ఏమన్నారంటే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook