Rajinikanth: చెన్నైలోని రాజ్‌భవన్ గవర్నర్ రవితో సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. సుమారు అరగంటపాటు సమావేశం జరిగింది. ఈసందర్భంగా రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా అన్న జర్నలిస్టుల ప్రశ్నకు రజనీకాంత్ స్పందించారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనకు తాను లేదని ఆయన స్పష్టం చేశారు.
తాను గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని..ఎలాంటి రాజకీయ అంశాలకు తావు లేదని తెలిపారు. తమిళనాడు, తమిళుల నిజాయితీ, సంస్కృతి గవర్నర్‌కు బాగా నచ్చాయని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఈసందర్భంగా తేల్చి చెప్పారు. పాలు, పెరుగు వంటి ప్రాజెక్టులపై జీఎస్టీ విధించడాన్ని సమర్థిస్తున్నారా అన్న ప్రశ్నకు సున్నితంగా తిరస్కరించారు.
గవర్నర్ భేటీలో రాజకీయాలు ప్రస్తావనకు వచ్చాయా అని అడగగా..అవునని ఆయన సమాధానం ఇచ్చారు. ఏ ఏ అంశాలు చర్చకు వచ్చాయో చెప్పేందుకు నిరాకరించారు. రాజకీయాల్లోకి వచ్చే మాత్రం తాను సిద్ధంగా లేనని మరోమారు స్పష్టం చేశారు. మరోవైపు వరుసగా సినిమాకు రజనీకాంత్ ఓకే చెబుతున్నారు. తదుపరి సినిమా జైలర్ ఈనెల 15న గానీ, 20న గానీ ప్రారంభంకానుందని తెలిపారు.
ఈసారైనా రాజకీయాల్లోకి రజనీకాంత్ వస్తారని అభిమానులు ఆశించారు. దీనిని సునితంగా తిరస్కరించారు. గతేడాది ముగిసిన తమిళనాడు ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగా అభిమానులతో వరుసగా సమావేశాలు ఏర్పాటు చేశారు. చివరకు తాను పోటీ చేయడం లేదని..పార్టీ సైతం ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేశారు. తన అభిమాన సంఘాలు అలాగే ఉంటాయని తెలిపారు.
Also read:Nandyala Constable Murder: నంద్యాలలో రెచ్చిపోయిన రౌడీ గ్యాంగ్.. కానిస్టేబుల్ దారుణ హత్య..
Also read:Horoscope Today August 9th : నేటి రాశి ఫలాలు.. ఈ రెండు రాశుల వారికి ఇవాళ అదృష్టం వెన్నంటే ఉంటుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook