Imran Khan Injured: పాకిస్థాన్‌లోని వజీరాబాద్‌లో ఇమ్రాన్ ఖాన్ కంటైనర్ ట్రక్కుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తుండగా దుండగులు పీటీఐ నేతలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆయన అనుచరులకు కలిపి మొత్తం నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సురక్షితంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నారని పాకిస్థాన్‌కి చెందిన జియో టీవీ వెల్లడించినట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందస్తు ఎన్నికలు చేపట్టాల్సిందిగా పాకిస్థాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో తన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఇమ్రాన్ ఖాన్ భారీ ర్యాలీ చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్ భారీ సంఖ్యలో కార్లు ఉన్న కాన్వాయ్‌తో వజీరాబాద్ వైపు నుంచి ఇస్లామాబాద్ వైపు వెళ్తుండగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. 



 


ఇమ్రాన్ ఖాన్‌కి సన్నిహితంగా ఉండే అనుచరుడు, సెనేటర్ అయిన పీటీఐ నేత ఫైజల్ జావేద్ ఖాన్ సైతం ఈ కాల్పుల దాడిలో గాయపడ్డారు. ఫైజల్ జావేద్ ఖాన్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్‌ని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక హత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు. పీటీఐ నేత ఫారుఖ్ హబీబ్ మాట్లాడుతూ.. దుండగుల కాల్పుల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ( Imran Khan ) గాయపడ్డారని.. దేశమంతా ఆయన క్షేమంగా ఉండాలని ఆ అల్లాని ప్రార్థించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.


Also Read : Tika Dutta Pokharel: ఎన్నికల బరిలో వందేళ్ల వృద్ధుడు.. మాజీ ప్రధానిపై పోటీకి సై


Also Read : Brazil New President: బోల్సనారో ఓటమి... బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డా సిల్వా..


Also Read : Philippines: ఫిలిప్పీన్స్ లో తుపాను భీభత్సం.. కొండచరియలు విరిగిపడి 42 మంది దుర్మరణం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి