/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Tika Dutta Pokharel Contest Against Prachand: నేపాల్‌ పార్లమెంటు ఎన్నికల్లో వందేళ్ల వృద్ధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు టికా దత్తా పోఖరెల్ పోటీకి సై అంటున్నారు. ఆయన మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండపై పోటీకి దిగుతున్నారు. నేపాలీ కాంగ్రెస్‌ (బీపీ) నుంచి బరిలోకి దిగుతున్నారు. తరఫున గోర్ఖా-2 నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

నవంబర్ 20న జరగనున్న నేపాల్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి హిమాలయ దేశాన్ని మళ్లీ హిందూ రాజ్యంగా మారుస్తానని టికా దత్తా పోఖరెల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గూర్ఖా జిల్లాలో జన్మించిన పోఖారెల్.. మాజీ ప్రధాని ప్రచండతో పాటు రెండు గూర్ఖా నియోజకవర్గాల నుంచి మరో 11 మంది అభ్యర్థులపై నామినేషన్ దాఖలు చేశారు. 99 ఏళ్ల వయసులో ఎన్నికల సంఘం ఆయన పేరును అభ్యర్థిగా నమోదు చేసింది. పోఖరెల్ సోమవారం ఆయన 100వ ఏట అడుగుపెట్టారు.

నేపాల్‌లో ఫెడరల్ పార్లమెంట్, ప్రావిన్షియల్ అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. నేపాల్ ఎన్నికల్లో పోటీ చేసిన అత్యధిక వయసు ఉన్న అభ్యర్థి ఆయనే. పోఖరెల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నానని నేపాలీ కాంగ్రెస్‌ (బీపీ) అధ్యక్షుడు సుశీల్‌ మాన్‌ సెర్చన్‌ తెలిపారు. 

దేశంలో అసలు నాయకుడే లేడని, నాయకులుగా చెప్పుకునే వారు డబ్బు సంపాదించడానికే వచ్చారని పోఖారెల్‌ అన్నారు. ప్రజలకు హక్కులు కల్పించి మన దేశాన్ని మళ్లీ హిందూ దేశంగా మార్చేందుకే నేను నామినేషన్ దాఖలు చేశానన్నారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రచండసై తాను ఎన్నికల్లో గెలుస్తానని తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు తన ఇంటికి వచ్చిన ప్రజలతో పోఖరెల్ చెప్పారు. 'గూర్ఖాలో ప్రతి రాయికి, మట్టికి నేను ఎలాంటి వాడినోనని తెలుసు. నా ప్రత్యర్థి గురించి ప్రజలకు బాగా తెలుసు. ఈ దేశ నాయకులు విధానానికి, సూత్రాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయకుండా దేశాన్ని దోచుకున్నారు..' అంటూ ఆయన విమర్శించారు. మావోయిస్టు పార్టీతో నేపాలీ కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుందని ఫైర్ అయ్యారు. 

Also Read: Chittoor Murder Case: పాల వ్యాన్ డ్రైవర్‌తో ప్రేమాయణం.. భర్త హత్యకు భార్య మాస్టర్ ప్లాన్.. నాటకం రక్తికట్టించి చివరికి..  

Also Read: Huzurnagar Death Case: కన్నకొడుకును హత్య చేయించిన తల్లిదండ్రులు.. చిన్న తప్పుతో దొరికిపోయారు   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Section: 
English Title: 
100 year old Freedom fighter Tika Dutta Pokharel contests in Nepal polls against former pm prachand
News Source: 
Home Title: 

Tika Dutta Pokharel: ఎన్నికల బరిలో వందేళ్ల వృద్ధుడు.. మాజీ ప్రధానిపై పోటీకి సై 
 

Tika Dutta Pokharel: ఎన్నికల బరిలో వందేళ్ల వృద్ధుడు.. మాజీ ప్రధానిపై పోటీకి సై
Caption: 
Tika Dutta Pokharel (Source: File Photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Tika Dutta Pokharel: ఎన్నికల బరిలో వందేళ్ల వృద్ధుడు.. మాజీ ప్రధానిపై పోటీకి సై
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, November 2, 2022 - 12:51
Request Count: 
61
Is Breaking News: 
No