Philippines: ఫిలిప్పీన్స్ లో తుపాను భీభత్సం.. కొండచరియలు విరిగిపడి 42 మంది దుర్మరణం..

Philippines Storm: ఫిలిప్పీన్స్ లో కురుస్తున్న కుండపోత వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 42 మంది మృత్యువాతపడ్డారు. మరో 16 మంది గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2022, 12:26 PM IST
Philippines: ఫిలిప్పీన్స్ లో తుపాను భీభత్సం.. కొండచరియలు విరిగిపడి 42 మంది దుర్మరణం..

Philippines Storm: ఫిలిప్పీన్స్ లో తుపాను విలయం సృష్టించింది. భారీ వర్షాలు, వరదలు కారణంగా కొండచరియలు విరిగిపడి దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్‌లో 42 మంది దుర్మరణం చెందారు. మరో 16 మంది గల్లంతయ్యారు. కొంత మంది ఇళ్ల పైకప్పులపై చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. ఈ కుండపోత వర్షాలకు చాలా మంది నిరాశ్రయులయ్యారు. కొందరు కొట్టుకుపోయారు. ఈ భారీ వర్షాలకు నాల్గే సైక్లోన్ నే కారణంగా తెలుస్తోంది. వరదలో చిక్కుకున్న 5వేల మందిని కోస్ట్ గార్డు, పోలీసులు, వాలంటీర్లు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే రాజధాని మనీలాతో సహా కొన్ని ప్రాంతాల్లో తుపాన్ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ఫిషింగ్, కార్గోబోట్లు, ఫెర్రీలను నిషేధించారు. 

తుపాను మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ఇళ్లు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ్యయాయి. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరకుండా వరదల్లో చిక్కుకుపోయారు. సెంట్రల్ సిబూ నగరంలో స్కూళ్లు మూసివేశారు. ఈ దేశం పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" (Ring of Fire) లో ఉంది. దాంతో తరుచు తుపానుల బారిన పడుతుంది. సంవత్సరానికి కనీసం 20 తుపానులు ఫిలిప్పీన్స్‌ను దెబ్బతీస్తాయి. రీసెంట్ గా వేసవి కాలంలో కూడా ఇక్కడ తుపానులు వస్తున్నాయి. 

Also read: Viral Video: షాకింగ్‌ ఘటన.. మహిళను మింగేసిన 22 అడుగుల కొండచిలువ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News