వచ్చే ఏడాది మార్చి నాటికి 'ఇన్‌బాక్స్ బై జీమెయిల్' అనే యాప్‌ను మూసివేయాలని గూగుల్ నిర్ణయించింది. కానీ.. ఏ తేదీన మూసివేస్తున్నారనే విషయంలో కచ్చితమైన తేదీని సంస్థ ప్రకటించలేదు. అయితే.. ఇన్‌బాక్స్ యూజర్లు జీమెయిల్‌‌లో సమాచారం బదిలీ చేసుకోవడానికి గూగుల్ సపోర్టు మాన్యువల్ రూపంలో ఒక గైడ్‌ను రిలీజ్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014లో 'ఇన్‌బాక్స్ బై జీమెయిల్' యాప్‌ను ప్రారంభించారు. జీమెయిల్‌తో పాటు ఇతర అకౌంట్లతోనూ పనిచేసుకోగల సౌకర్యం కల్పించే యాప్ ఇది. ఈ యాప్ ప్రతి మెసేజ్‌ను టాస్క్ రూపంలోకి మలిచి, ఆ టాస్క్‌ను మీకు రిమైండ్ చేస్తుంది. ఒకవేళ మీ వద్ద ఆ మెసేజ్‌ను చూసేంత టైం లేకపోతే ఆ మెసేజ్‌లను పిన్ చేసుకుని తీరిక వేళల్లో చెక్ చేసుకునే వీలుంటుంది. దీనివల్ల మీ పాత అకౌంట్లకు ఎలాంటి ప్లాబ్లం కూడా ఉండదు.


తాజాగా 'ఇన్‌బాక్స్ బై జీమెయిల్' యాప్‌ను మూసివేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. కొత్తగా అప్‌డేట్ అయిన జీమెయిల్‌లో 'ఇన్‌బాక్స్ బై జీమెయిల్'లోని అన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంతో.. ఇక ఆ యాప్‌తో అవసరం లేదని గూగుల్ అభిప్రాయానికి వచ్చింది. కాగా వచ్చే ఏడాది మార్చి నాటికి 'ఇన్‌బాక్స్ బై జీమెయిల్' సేవలు నిలిచిపోతాయని కంపెనీ ప్రకటించింది.