Trump Impeachment: ట్రంప్ అభిశంసనపై విచారణ ప్రారంభం..కౌంటింగ్ లో నెగ్గేనా
Trump Impeachment: అమెరికా చరిత్రలో డోనాల్డ్ ట్రంప్ పేరు ఎవ్వరూ మర్చిపోలేరు. రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా..అభిశంసన ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా ఇలా చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసనపై విచారణ ప్రారంభమైంది.
Trump Impeachment: అమెరికా చరిత్రలో డోనాల్డ్ ట్రంప్ పేరు ఎవ్వరూ మర్చిపోలేరు. రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా..అభిశంసన ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా ఇలా చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసనపై విచారణ ప్రారంభమైంది.
అమెరికా ( America ) చరిత్రలోనే తొలిసారిగా ఓ మాజీ అధ్యక్షుడిపై ప్రవేశపెట్టిన అభిశంసన ( Impeachment )పై సెనేట్‌లో విచారణ ప్రారంభమైంది. అమెరికా క్యాపిటల్ భవనం ( Capitol Building )పై జరిగిన దాడి ఘటనలో ట్రంప్‌ను ముద్దాయిగా తేల్చడం, అలాంటి వ్యక్తికి రిపబ్లికన్లు కొమ్ము కాస్తున్నారని ప్రజలకు చెప్పడం కోసం డెమోక్రట్లు అభిశంసనపై తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన అభిశంసన సెనేట్‌లో మూడు దశలు దాటాల్సి ఉంటుంది. ముందుగా విచారణకు మెజార్టీ ఓటింగ్‌తో తీర్మానం ఆమోదం పొందాలి. అనంతరం సెనెట్ ( Senate )లో ఇరుపక్షాల వాదనల కోసం దాదాపుగా 20 గంటల ప్రహసనం ఉంటుంది. ఆ తరువాత జరిగే ఓటింగులో రెండింట మూడు వంతుల మెజార్టీతో ఆమోదం పొందాలి.
ఇప్పుడు సెనేట్‌లో తొలిదశ దాటింది అభిశంసన తీర్మానం ( Impeachment resolution ). సెనేట్‌లో 56-44 ఓట్ల తేడాతో తీర్మానం విచారణకు ఆమోదం పొందింది. క్యాపిటల్ భవనంపై దాడికి డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) ప్రోత్సహించారన్న అభియోగాలపై విచారణ కొనసాగుతుంది. సంబంధిత వీడియోలను వినియోగించాలని డెమోక్రాట్లు ( Democrats ) వ్యూహరచన చేస్తున్నారు. విచారణ సందర్బంగా ట్రంప్ ఆందోళనకారుల్ని ఎలా రెచ్చగొట్టారో సభ సాక్షిగా వీడియోలతో నిరూపించేందుకు సభ్యలు ప్రయత్నిస్తున్నారు. అభిశంసనపై వాదనలు విన్పించేందుకు ఇరుపక్షాలకు 16 గంటల సమయం కేటాయిస్తారు. ఆ తరువాత సెనేట్ సభ్యులకు ఇరుపక్షాల్ని ప్రశ్నించేందుకు నాలుగు గంటల సమయముంటుంది. అంటే మొత్తం 20 గంటల ప్రక్రియ నడుస్తుంది. చివరిగా అభిశంసనపై కౌంటింగ్ ( Impeachment counting ) ప్రారంభం కానుంది.
Also read: H1B Visa: హెచ్1బీ వీసాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా
అభిశంసన నెగ్గుతుందా లేదా
విచారణకు సెనేట్‌లో తీర్మానం ఆమోదం పొందినా..వాదనలో నెగ్గినా..కౌంటింగ్ ( Counting ) లో వీగిపోయే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఎందుకంటే సెనేట్‌లో ఇరు పక్షాలకు చెరో 50 మంది సభ్యుల బలముంది. రెండింట మూడు వంతుల మెజార్టీ కావల్సి ఉంటుంది. అంటే 67 మంది సభ్యుల మద్దతు అవసరం. విచారణలో ఆరుగురు రిపబ్లికన్ ( Republicans ) సభ్యులు తీర్మానానికి మద్దతు తెలిపారు. ఆ ఆరుగురితో కలుపుకుంటే డెమోక్రాట్ల బలం 56కు చేరుకుంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఉపాధ్యక్షురాలు సభ ఛైర్మన్ కమలా హ్యారిస్ ( Kamala harris ) ఓటేయవచ్చు. ఈమె ఓటు కలుపుకున్నా 57 అవుతుంది. మరో పదిమంది సభ్యుల మద్దతు అవసరం. సో తీర్మానం కౌంటింగ్ ప్రక్రియలో వీగిపోయేందుకు అవకాశాలెక్కువగా ఉన్నాయి.
Also read: Twitter vs Koo: ట్విట్టర్‌కు పోటీగా కూ లో చేరిన మంత్రి..ట్విట్టర్‌లో ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook