Crocodile Chases Swimmer Bites His Arm: బ్రెజిల్‌లోని (Brazil) క్యాంపో గ్రాండెలోని లాగో డో అమోర్‌ సరసులో ఒక ఆసక్తికార ఘటన వెలుగుచూసింది.. ఒకతను నీటిని చూడగానే ఈత కొట్టడానికి దిగటానికి వెళ్లాడు. కాసేపు ఈత కొడుతూ సరసు మధ్య వరకు వెళ్లాడు. కానీ కాసేపటి తరువాత అతను వేగంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నాడు.. ఎందుకంటే అతడిపై చాలా వేగంగా మొసలి మోసాలు దూసుకొచ్చి దాడి చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... అతడి పేరు కెటానో (Ketano) అక్టోబర్ 23 వ తేదీన సాయంత్రం పూత బ్రెజిల్‌లోని క్యాంపో గ్రాండెలోని లాగో డో అమోర్‌ సరస్సులో ( L'AMORE Lake) ఈత కోసమని దిగాడు. అయితే అలానే అతడు ఈదుకుంటూ తెలియకుండానే నిషేధిత ప్రాంతానికి చేరుకున్నాడు. ఒడ్డుపై ఉన్న విల్యాన్‌ కెటనో (Vilyan Ketano) అనే వ్యక్తి ఇదంత తన ఫోన్ లో రికార్డు చేస్తున్నాడు 


Also Read: Pakistan Vs New Zealand: ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాకిస్తాన్‌ను న్యూజిలాండ్‌ నిలువరించగలదా..??


ఆ సరస్సులో మొసళ్లు ఉన్నాయన్న సంగతి అక్కడ అందరికి తెలిసిందే.. కెటానో నీటిలో ఈదుతున్న సమయంలో ఒక మొసలి వేగంగా వచ్చి అతడిపై దాడి చేసింది.. కెటానో ఈదుతున్న సమయంలో వెనకాల నీటిలో ఎదో కదులుతున్నట్లు గమనించి.. వెనక్కి తిరిగి చూసాడు.. అంతే.. మరో ఆలోచన లేకుండా వేగంగా ఒడ్డుకు ఈదుకుంటూ రావటానికి ప్రయత్నం చేసాడు.. 




కానీ అప్పటికీ ఆ మొసలి అతడిని గాయపరిచింది.. ఏది ఏమైనా కెటానో ఒడ్డుకు చేరుకున్నాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీడియోలో మొసలి అతడికి దూసుకొచ్చిన తీరు చూస్తే చాలా భయంకరంగా ఉంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. వీడియో చూసిన వారు.. "నీ ఆయువు గట్టిదే.."  "కాస్తలో తప్పించుకున్నావు.." "లక్కీ మెన్".. అంటూ కామెంట్ చేస్తున్నారు.  


Also Read: Bank Holidays in November: న‌వంబ‌ర్‌లో 17 రోజులు బ్యాంకులకు సెలవులంటా.. అన్ని రాష్ట్రాలకు కాదండోయ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook