Ban on indian businessman: భారతీయ వ్యాపారిపై బ్రిటన్‌లో నిషేధం
Ban on indian businessman: అక్కడ చట్టాలు చాలా కఠినం. పన్ను ఎగవేస్తే ఏకంగా నిషేధమే. చట్టం ఉల్లంఘించినా..నిబంధనలు పాటించకపోయినా కఠినంగా వ్యవహరిస్తారు. బ్రిటన్‌లో అదే జరిగింది. భారతీయ సంతతికి చెందిన వ్యాపారికి శిక్ష విధించింది.
Ban on indian businessman: అక్కడ చట్టాలు చాలా కఠినం. పన్ను ఎగవేస్తే ఏకంగా నిషేధమే. చట్టం ఉల్లంఘించినా..నిబంధనలు పాటించకపోయినా కఠినంగా వ్యవహరిస్తారు. బ్రిటన్‌లో అదే జరిగింది. భారతీయ సంతతికి చెందిన వ్యాపారికి శిక్ష విధించింది.
బ్రిటన్ ( Britain ) లోని లీసెస్టర్ ( Leicestor )లో ఉన్న ఈస్ట్ మిడ్‌ల్యాండ్ టౌన్ ( East midland town ) లో లేడీస్ గార్మెంట్స్ కంపెనీ డైరెక్టర్ సురేందర్ సింగ్‌పై బ్రిటీషు ప్రభుత్వం ( British Government ) ఆరేళ్ల పాటు నిషేధం విధించింది. భారతీయ సంతతికి చెందిన ఈ వ్యాపారి పన్ను చెల్లించని కారణంగా ఈ శిక్ష వేస్తున్నట్టు బ్రిటన్ ఇన్‌సాల్వెన్సీ అధికారులు వెల్లడించారు. లేడీస్ గార్మెంట్స్ కంపెనీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సురేందర్ సింగ్ 2018 ఏప్రిల్ నుంచి 98 వేల పౌండ్స్ టాక్స్ చెల్లించలేదని తేలింది. పన్ను చెల్లించని ( income tax ) కారణంగా 2019 జూలై నెలలో కంపల్సరీ లిక్విడేషన్‌లో పెట్టామని అధికారులు చెప్పారు.
అసలు జరిగిందేంటంటే 2017 నవంబర్ నుంచి 2019 మార్చ్ వరకూ 1.80 లక్షల పౌండ్లను విత్‌డ్రా చేసుకున్న సురేందర్ సింగ్ ..కారణాల్ని మాత్రం వెల్లడించలేదు. సరైన రికార్డుల్ని కూడా చూపించలేదని ఇన్‌సాల్వెన్సీ ( Insolvency ) అధికారులు తెలిపారు. వివరాల్ని దాచిపెట్టి పన్ను చెల్లించకుండా లబ్ది పొందేందుకు ప్రయత్నించారని బ్రిటన్ అధికార వర్గాలు వెల్లడించాయి.
Also read: New coronavirus strain: అమెరికాలో తొలి కరోనా వైరస్ స్ట్రెయిన్