New coronavirus strain: ప్రపంచాన్ని మరోసారి వణిికిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను కూడా తాకింది. ఏ విధమైన ట్రావెల్ హిస్టరీ లేని ఓ యువకుడికి సోకడంతో ఆశ్చర్యకరంగా మారింది.
కరోనా వైరస్ సంక్రమణ భయం నుంచి కోలుకోకముందే అగ్రరాజ్యం అమెరికాను ఇప్పుడు బ్రిటన్ కొత్త వైరస్ ఆందోళన పట్టుకుంది. బ్రిటన్ లో ప్రారంభమై అమెరికాకు చేరడమే దీనికి కారణం. కొలరాడో ( Colorado state ) రాష్ట్రంలోని 20 ఏళ్ల వ్యక్తికి కొత్త వైరస్ సోకినట్టు ఆ రాష్ట్ర గవర్నర్ జేర్డ్ పొలిస్ వెల్లడించారు.
అది కూడా 20 ఏళ్ల యువకుడికి..ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకపోయినా..ఎటువంటి కాంటాక్ట్స్ లేకపోయినా కొత్త స్ట్రెయిన్ సోకడం మిస్టరీగా మారింది. ఏ విధమైన ప్రయాణ చరిత్ర లేని వ్యక్తి..తొలి కేసుగా నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. బాథితుడి ప్రైమరీ కాంటాక్ట్స్ తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. కొత్త వైరస్ బ్రిటన్ లో వెలుగు చూసినప్పటి నుంచీ ఆ దేశం నుంచి వచ్చేవారు విధిగా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాల్సిందేనన్న నిబంధన పెట్టారు. ఇప్పటికే 40 దేశాలు బ్రిటన్ దేశానికి విమాన రాకపోకల్ని నిషేధించాయి.
Also read: Aviation News: ఆ దేశానికి వెళ్లొద్దని అనధికారికంగా సూచించిన భారత ప్రభుత్వం!