ఐరాసలో పాకిస్తాన్ చెంప చెళ్లుమనిపించిన భారత ప్రతినిధి డాక్టర్ కాజల్ భట్ .. వీడియో
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్/లీగల్ అడ్వైజర్ డాక్టర్ కాజల్ భట్ UNSCలో కాశ్మీర్ సమస్యను మళ్లీ లేవనెత్తి... పాకిస్తాన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆ వీడియో మీరే చూడండి.
India's Adviser Slamming Pakistan at UNSC: ఐక్యరాజ్య సమితి (UN) భద్రతా మండలిలో మరో సారి భారత్ ప్రతినిధి.. పాకిస్తాన్ (Pakistan) పై మండిపడ్డారు. పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలకు తిప్పికొట్టారు.. ఈ విషయంలో భారత్ (India) ప్రతినిధి మాట్లాడుతూ.. మొదటగా పాకిస్తాన్ దళాలు, సహచరులు ఆక్రమించిన భారత భూభాగాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు.
ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్/లీగల్ అడ్వైజర్ డాక్టర్ కాజల్ భట్ (Dr Kajal Bhat) మాట్లాడుతూ.. "పాకిస్తాన్ చేసిన ఆరోపణలను ఖండించటానికి మళ్లీ మీ ముందుకు రావాల్సి వచ్చింది.. ప్రపంచ దేశాలకు తెలుసు.. పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఉగ్రవాదులకు (Terrorism) సహాయ సహకారాలను అందిస్తుంది. ప్రపంచంలో ఒక్క పాకిస్థాన్ మాత్రమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది.. ఉగ్రవాద సంస్థలకు ఆర్థికంగా, ఆయుధాల పరంగా మరియు మౌలిక పరమైన సహాయ సహకారాలను అందజేస్తున్న సంగతి అందరికి తెలిసిందే."
Also Read: సమస్యలతో సతమతం అవుతున్నారా..? జమ్మి చెట్టు ఇంట్లో నాటితే అన్ని కష్టాలు తొలగిపోతాయి
"ఐరాస (UN) నిషేదిత ఉగ్రవాదులకు రక్షణ కలిపిస్తున్న పాకిస్తాన్ ఇపుడు ఈ వేదికగా భారత్ పై బురద జల్లటానికి ఐరాస వేదికను దుర్వినియోగం చేస్తుంది. అంతేకాకుండా.. మైనార్టీలపై అత్యచారాలకు పాల్పడుతున్న ఉగ్రవాదుల పై ఉన్న ప్రపంచ దేశాల దృష్టి మళ్లించటానికే భారత్ పై ఇలాంటి ఆరోపణలు చేస్తుందని తెలిపారు."
"జమ్ము-కాశ్మీర్ (Jammu and Kashmir), లద్ధాక్ (Ladakh) మొదటి నుండే భారత దేశ అంతర్భాగాలు.. అక్రంగా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలను పాకిస్తాన్ బలగాలు అక్రమంగా చొరబడి (Pakistan Occupied Kashmir).. ఆక్రమించి.. కవ్వింపు చర్యలని కొనసాగిస్తోంది. వెంటనే భారత ఆక్రమించిన భూభాగాలను వదిలి వెళ్లాలని" ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్/లీగల్ అడ్వైజర్ డాక్టర్ కాజల్ భట్ UNSCలో కాశ్మీర్ సమస్యను మళ్లీ లేవనెత్తి... పాకిస్తాన్‌ను తీవ్రంగా విమర్శించారు.
Also Read: 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook