Indonesia Oil Ban: ప్రపంచవ్యాప్తంగా వంటనూనెల ధరలు మరోసారి భగ్గుమనే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆకాశాన్నంటిన వంటనూనెల ధరలు మరింత పెరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పామ్‌ఆయిల్ ఎగుమతిదారు అయిన ఇండొనేషియా తీసుకున్న షాకింగ్ నిర్ణయం వంటనూనెల మార్కెట్ ను తీవ్రంగా ప్రభావితంచేయనుంది. ఈ నెల 28 నుంచి పామ్ ఆయిల్ ఎగుమతులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఇండొనేషియా. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా వంటనూనెల ధరలు మరోసారి భారీగా పెరిగే అవకాశముంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పామ్‌ఆయిల్ ఎగుమతుల్లో వరల్డ్ నెంబర్ వన్ గా ఉంది ఇండొనేషియా. ప్రపంచానికి అవసరమైన పామ్‌ఆయిల్ లో సగం అక్కడే ఉత్పత్తి అవుతుంది. అలాంటి దేశంలో ఇటీవల  వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ప్రపంచ దేశాల్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ కు కొరత ఏర్పడింది. దీంతో చౌకగాలభించే పామ్‌ఆయిల్ కు డిమాండ్ పెరిగింది. ఆ ప్రభావంతో ఇండొనేషియా నుంచి ఎగుమతులు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఇప్పుడాదేశంలో వంటనూనెలకు కొరత ఏర్పడి... ధరలు ఆకాశాన్నంటాయి. దీనిపై ఆదేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి అక్కడి ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. దేశంలో నిల్వలు పెరిగే వరకు పామాయిల్ ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 28 నుంచి నిషేధం అమల్లోకి రానుంది.


ఇండొనేషియా తీసుకున్న అకస్మాత్తు నిర్ణయం ప్రపంచదేశాలను షాక్ కు గురిచేసింది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి. ఇండొనేషియా నిషేధ ఫలితంగా ఈ పెరుగుదలకు అడ్డూఅదుపూ లేకుండా పోయే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్ తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ పై ఈ ప్రభావం ఎక్కువగా పడే ఛాన్సుంది. ప్రతినెలా భారత్ కు నాలుగు మిలియన్ టన్నుల పామాయిల్ ను ఇండొనేషియా ఎగుమతి చేస్తోంది. ఈ లోటు పూర్చుకోవడం భారత్ కు కత్తిమీదసాములా మారనుంది. 


ఇండొనేషియా తర్వాత అతిపెద్ద పామాయిల్ ఎగుమతిదారు అయిన మలేషియా కూడా ప్రస్తుతం కూలీలు లేక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనివల్ల అక్కడినుంచి కూడా పామాయిల్ లభించే అవకాశం కనిపించడం లేదు. పామాయిల్ పై ఇండొనేషియా నిషేధ ప్రభావం భారత్ పై అత్యంత తీవ్రంగా ఉండబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నాదు. దీనిపై తక్షణం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో దేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ నిల్వలు అడుగంటుతున్నాయి. అటు పామాయిల్ కు ప్రత్యామ్నాయంగా వాడే సోయాబీన్ ఆయిల్ ధరలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆల్‌టైంహైకి చేరాయి. దీంతో ఈ సంక్షోభాన్ని ఎలా నివారించాలనే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.


Also read: Rajamouli New Luxury Car: కొత్త కారు కొన్న జక్కన్న... ఆ లగ్జరీ కారు ధరెంతో తెలుసా...


Also read: Bride Groom Pushups Video: వధూవరుల మధ్య 'పుషప్స్' పోటీ.. వధువు ఫిట్నెస్ కి అతిధులు ఫిదా..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.