Rajamouli New Luxury Car: కొత్త కారు కొన్న జక్కన్న... ఆ లగ్జరీ కారు ధరెంతో తెలుసా...

Rajamouli New Luxury Car: జక్కన్న గ్యారేజీలో మరో కొత్త కారు చేరింది. వోల్వో కంపెనీకి చెందిన లగ్జరీ కారును రాజమౌళి కొనుగోలు చేశారు. ఆ ఫోటోను వోల్వో కంపెనీ తమ ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2022, 04:31 PM IST
  • కొత్త కారు కొన్న జక్కన్న
  • వోల్వో ఎక్స్‌సీ 40 మోడల్ కారు కొనుగోలు చేసిన రాజమౌళి
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్ చేసిన వోల్వో కంపెనీ
Rajamouli New Luxury Car: కొత్త కారు కొన్న జక్కన్న... ఆ లగ్జరీ కారు ధరెంతో తెలుసా...

Rajamouli New Luxury Car: 'ఆర్ఆర్ఆర్' సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న దర్శక దిగ్గజం రాజమౌళి ఇటీవల కొత్త కారును కొనుగోలు చేశారు. వోల్వో కంపెనీకి చెందిన 'ఎక్స్‌సీ 40' మోడల్ కారును కొనుగోలు చేశారు. దీని ధర రూ.44.50 లక్షలు. రాజమౌళికి కారు డెలివరీ చేసిన వోల్వో ప్రతినిధి ఆయనకు కారు తాళాలు అందించారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి ఫోటో దిగారు. ఆ ఫోటోను వోల్వో కంపెనీ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. 

వోల్వో కార్ ఇండియా ఫ్యామిలీలోకి రాజమౌళిని సాదరంగా ఆహ్వానిస్తున్నామని వోల్వో కంపెనీ ఇన్‌స్టా పోస్టులో పేర్కొంది. రాజమౌళి విజనరీకి తగ్గట్లే ఆయన ప్రయాణాలు సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగాలని కోరుకుంటున్నామని తెలిపింది. వోల్వో కంపెనీ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు... రాజమౌళికి కంగ్రాట్స్ చెబుతున్నారు. నిజానికి రాజమౌళి కొనాల్సింది కారు కాదని.. ఏకంగా ఓ విమానాన్నే కొనాలని... ఆయన హోదాకు అదే కరెక్ట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 

వోల్వో ఎక్స్‌సీ 40 విశేషాలు :

వోల్వో ఎక్స్‌సీ 40 కారులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎంఐడీ టచ్ స్క్రీన్, డిస్టెన్స్ అలర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, టీ షేప్ డే టైమ్ రన్నింగ్ లైట్లతో కారు ఆకర్షణీయమైన లుక్‌లో కనిపిస్తోంది. కారు లోపలి భాగంలో పియానో బ్లాక్, అల్యూమినీయం పెయింట్‌తో స్మూత్ అండ్ ప్లెజెంట్ లుక్‌లో కనిపిస్తోంది.

Also Read: Goa Special Permit: గోవా వెళ్తున్నారా? ఆ తప్పు చేస్తే రూ.10 వేల జరిమానా తప్పదు!

Also Read:Viral Video: ఫోన్ సంభాషణలో మునిగిపోయి... మ్యాన్ హోల్‌లో పడిపోయిన మహిళ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News