Google Doodle: మహిళా మహారాణులకు Womens Day 2021 శుభాకాంక్షలు తెలిపిన గూగుల్
Google Doodle On International Womens Day 2021: ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ‘ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే’ను ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. ఉమెన్స్ డే సందర్భంగా మహిళల్ని గౌరవిస్తూ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ డూడుల్ విడుదల చేసింది.
International Womens Day 2021 Google Doodle: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ‘ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే’ను ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. ఉమెన్స్ డే సందర్భంగా మహిళల్ని గౌరవిస్తూ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ డూడుల్ విడుదల చేసింది. మహిళలకు విశిష్ట గౌరవాన్ని అందిస్తూ నారీమణులకు ఈ డూడుల్‌ను గూగుల్ అంకితం ఇచ్చింది.
ప్రతి రంగంలోనూ తొలిసారిగా ఘనత సాధించిన మహిళల విజయాలను గుర్తు చేస్తూ గూగుల్ డూడుల్‌ను రూపొందించడం విశేషం. విద్య, పౌర హక్కులు, వైద్యశాస్త్రం, న్యాయశాస్త్రం, కళలు, సాహిత్యం, క్రీడలు, ఇలా పలు రంగాలలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మేము సైతం అంటూ తొలిసారిగా మహిళల సత్తా చాటిన విశిష్ట వ్యక్తులను స్మరించుకుంటూ మహిళా దినోత్సవం 2021(Womens Day 2021) గూగుల్ డూడుల్ రావడం హర్షణీయం.
Also Read: Womens Day 2021 Wishes: నారీమణులకు వుమెన్స్ డే విషెస్ ఇలా తెలపండి
నింగి, నేల అనే తారతమ్యం లేకుండా మహిళలు అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. ఆకాశమే తమ హద్దుగా మహిళా శక్తిని ప్రతిబింబిస్తూ గూగుల్ యానిమేషన్ వీడియోతో డూడుల్‌ను తీసుకొచ్చి స్త్రీమూర్తులను గౌరవించుకుంది. ఎంతో వివక్ష, వేధింపులు, అవమానాలు ఎదుర్కొంటూ ప్రతిరంగంలోనూ తమ హక్కులు సాధించుకుని, సత్తా చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పై వీడియో వీక్షిస్తూ మీకు దాని ప్రాధాన్యత అర్థమవుతుంది.
Also Read: Pregnancy Tips: ఇద్దరు పిల్లలకు మధ్య మహిళలు ఎంత Age Gap ఎంత తీసుకోవాలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook