Pregnancy Tips: ఇద్దరు పిల్లలకు మధ్య మహిళలు ఎంత Age Gap ఎంత తీసుకోవాలంటే

Pregnancy Tips In Telugu: పెళ్లి తరువాత పిల్లల గురించి శుభవార్త ఎప్పుడు చెబుతారు అంటూ కుటుంబసభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తుంటారు. 2వ సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 23, 2021, 01:02 PM IST
  • భారతీయ సమాజంలో వివాహం చాలా ముఖ్యమైన విషయం
  • 2వ సంతానం విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి
  • రెండు నుంచి 3 సంవత్సరాలు అంతరం తీసుకోవాలంటున్న నిపుణులు
Pregnancy Tips: ఇద్దరు పిల్లలకు మధ్య మహిళలు ఎంత Age Gap ఎంత తీసుకోవాలంటే

How Much Age Gap Should Be Between Two Kids: భారతీయ సమాజంలో వివాహం చాలా ముఖ్యమైన విషయం. అయితే పెళ్లి తరువాత పిల్లల గురించి శుభవార్త ఎప్పుడు చెబుతారు అంటూ కుటుంబసభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తుంటారు. అయితే తొలి బిడ్డ విషయంలో మీరు ఎలా ఉన్నా పరవాలేదు, కానీ 2వ సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 

తొలి సంతానం తరువాత రెండో సంతానం గురించి సైతం దంపతులను ప్రశ్నలు అడుగుతుంటారు. అయితే 2వ సంతానం, ఆ తరువాత సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు(Pregnancy Tips) తీసుకోవాలి. కచ్చితంగా తొలి సంతానానికి, తరువాత సంతానానికి మధ్య కొంచెం విరామం తీసుకోవాలి. మహిళల ఆరోగ్యం కోసం కొన్ని నెలలు విరామం తీసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Lemon Water: నిమ్మరసం అధికంగా తాగుతున్నారా, ఈ Side Effects తెలుసుకోండి

ఇద్దరు పిల్లల మధ్య ఎంత అంతరం ఉండాలి
మొదటి బిడ్డ మరియు రెండవ బిడ్డ మధ్య సాధారణంగా 1 ఏడాది నుంచి 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు అంతరం మనం చూస్తుంటాం. అయితే అంతరం తగ్గించడం వల్ల మహిళల ఆరోగ్యం దెబ్బతింటుంది. పిల్లల మధ్య అంతరం పెంచితే స్త్రీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. మహిళ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇద్దరు పిల్లల మధ్య ఎంత వ్యత్యాసం ఎంత ఉండాలో ఇక్కడ తెలుసుకోండి.

Also Read: Back Pain: వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల నడుము నొప్పి వస్తుందా, ఈ Health Tips పాటిస్తే సరి 

12 నుంచి 18 నెలల మధ్య వ్యత్యాసం
రెండవ బిడ్డను ప్లాన్ చేసే ముందు తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అందువల్ల తొలి సంతానం తరువాత 2వ సంతానానికి మధ్య అంతరం 12 నుండి 18 నెలల లేదా అంతకంటే తక్కువ తేడా ఉంటే, అది గర్భిణీ ఆరోగ్యంలో ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒకే సమయంలో కొన్ని నెలలపాటు ఇద్దరు పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం, రాత్రిపూట మేల్కొని ఉండి పిల్లలను చూసుకోవడం వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతింటుంది.   

అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation)తో పాటు పలు  అధ్యయనాలు ఇద్దరు సంతానం మధ్య కనీసం 2 సంవత్సరాల వ్యవధి ఉండాలని సూచించారు. రెండో సంతానానికి మధ్య అంతరం 2 ఏళ్లలోపు ఉన్నట్లయితే రెండో సంతానం తక్కువ బరువుతో, లేక అంత అరోగ్యంగా జన్మించే అవకాశాలు అధికంగా ఉంటాయి.

Also Read: Corona Vaccine: కరోనా విజేతలపై ఆసక్తికర విషయం, COVID-19 Vaccine ఒక్క డోసు ఇస్తే చాలు

2 నుండి 3 సంవత్సరాల అంతరం
చాలా మంది వైద్యులు రెండో సంతానం కోసం కనీసం రెండేళ్ల నుంచి 3 సంవత్సరాలు వేచి ఉండాలని సూచిస్తున్నారు. 2 నుండి 3 సంవత్సరాలు వేచి ఉన్న తరువాత, స్త్రీ రెండవ సారి గర్భవతిగా మారేలోగా స్త్రీ శరీరం పూర్తిగా కోలుకుంటుంది. ఆరోగ్యంగా తయారవుతారు. తొలి బిడ్డకు పాలు ఇవ్వడం సైతం ఆపేస్తారు కనుక ఆ తరువాత పుట్టే బిడ్డ ఒక్కరికి మాత్రమే ఒకసారి పాలు ఇవ్వాల్సి వస్తుంది. రెండో చిన్నారి ఆలనాపాలనా చక్కగా చూసుకోగలదు.

5 సంవత్సరాల కన్నా ఎక్కువ అంతరం
మొదటిసారి గర్భం దాల్చినప్పుడు మీకు 30 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయసు ఉంటే, రెండో సంతానానికి 5 ఏళ్ల అంతరం తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే రెండో సంతానం సమయంలో కనీసం 35ఏళ్లు ఉంటాయి, అప్పుడు మీకు బీపీ, షుగర్(Diabetes) ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. కనుక రెండు నుంచి 3 ఏళ్ల గ్యాప్‌ తీసుకుని రెండో సంతానం కనాలని వీరికి సైతం సిఫార్సు చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో 35 ఏళ్లు దాటిన తర్వాత గర్భధారణ సమయంలో రక్తపోటు, మధుమేహం మరియు మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. 

Also Read: Copper Health Benefits: రాగి కడియం ధరించే అలవాటు ఉందా, అయితే Copper Benefits తెలుసుకోండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News