అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ట్రంప్‌ను ఒక ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ..వెళ్లిపోతుండటంపై సంతోషం వ్యక్తం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ( America president elections ) డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) ఓటమికి ఎక్కువగా సంతోషిస్తున్న దేశం ఇరాన్. డోనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం కట్టుబాట్లు లేని వ్యక్తి అని..ఒక ఉగ్రవాది ( Terrorist ) అని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ( Iran president Hassan rouhani )వ్యాఖ్యానించారు. జో బిడెన్ వచ్చినందుకు సంతోషమేమీ లేదు గానీ ట్రంప్ వెళ్లిపోతుండటం మాత్రం ఆనందాన్నిస్తోందన్నారు. 


అధ్యక్ష పీఠం ఎక్కినప్పటి నుంచి ఇరాన్ ( Iran ) దేశానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న డోనాల్డ్ ట్రంప్..ఇజ్రాయిల్ , గల్ఫ్ దేశాల్ని ఇరాన్‌కు వ్యతిరేకంగా కూడా నిలబెట్టారు. 2018లో ఇరాన్‌తో ఉన్న న్యూక్లియర్ డీల్ ( Nuclear Deal ) రద్దు చేసి..ఆంక్షలు విధించారు. బాగ్దాద్ ఎయిర్ పోర్ట్‌పై వైమానిక దాడులు జరిపించి..ఇరాన్ జనరల్ ఖాసిమ్ సులేమానీని ( Iran general khasim sulemani ) హత్య గావించారు ట్రంప్. బహుశా అందుకే ట్రంప్ ఓటమిపై ఇరాన్ అంతగా సంతోషం వ్యక్తం చేస్తోంది.


మరోవైపు అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ ( Joe Biden )..ఇరాన్‌తో మళ్లీ దౌత్యానికి సిద్ధమని ప్రకటించడం..ఇరాన్ కూడా ఆ దిశగా సంకేతాలు పంపడం గమనార్హం. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతను తగ్గించేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయనేది విశ్లేషకుల భావన.


Also read: Covid19 vaccine: కరోనా వ్యాక్సిన్‌ను ఏ దేశం ఎన్నెన్ని బుక్ చేసుకుందంటే…