కరోనా వైరస్ ( Coronavirus ) పై చైనా విషయంలో ఉన్న అనుమానాలు నిజమేనా ?  ఆ ప్రాణాంతక వైరస్ వుహాన్ ల్యాబ్ లోనే తయారైందా ? దీనికి ఆధారాలున్నాయంటున్నారు హాంకాంగ్ శాస్త్రవేత్త.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ( Cornavirus pandemic ) విషయంలో అమెరికా వంటి అగ్రదేశాలు చైనా ( China ) పైనే ఆరోపణలు సంధించాయి. వైరస్  చైనా ల్యాబ్ లో తయారైందని..ఇది చైనా కుట్ర అంటూ విమర్శలు చెలరేగాయి. ఈ విషయంపై చాలా వాదోపవాదాలు జరిగాయి. ఇప్పుడు హాంకాంగ్ ( Hongkong ) కు చెందిన ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ లి మెంగ్ యాన్ ( Dr lee meng yon ) సంచలనం ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని వుహాన్ ల్యాబ్ ( Wuhan lab ) లోనే కరోనా వైరస్ తయారైందంటున్నారు. తన వాదనను బలపరిచే ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. హాంకాంగ్ దేశపు ప్రముఖ సైంటిస్టుల్లో ఒకరైన డాక్టర్ లి మెంగ్ యాన్...వైరస్ విషయంలో మొదట్నించీ ఇదే విషయం చెబుతున్నారు. ఇప్పుడు ఆధారాలున్నాయంటున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇటీవల ఆమె హాంకాంగ్ నుంచి అమెరికాకు తరలివచ్చేశారు. 


కరోనా వైరస్ పై తాను రెండు ప్రయోగాలు చేసి ఆ ఫలితాలను ఉన్నతాధికార్లతో పంచుకున్నానన్నారు. అయితే ఈ విషయంలో తనను నిశ్శబ్దంగా ఉండమని..లేకపోతే చంపేస్తారని బెదిరించారన్నారు. కేవలం ఆరోపించడం కాదు..తన వద్ద ఆధారాలున్నాయని చెబుతున్న డాక్టర్ లి మెంగ్ యాన్ వాదన ఎంతవరకూ నిజం మరి. Also read: AstraZeneca Vaccine: వ్యాక్సిన్ కు క్లీన్ చిట్.. మళ్లీ ట్రయల్స్ ప్రారంభం