చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికిస్తోంది ప్రాణాంతక కరోనా వైరస్ (CoronaVirus). మామూలు వ్యక్తుల వరకు ఓకేకానీ గర్భంతో ఉన్న మహిళలు పరిస్థితిని మాటల్లో చెప్పలేం. తమకు ఏమైనా సరే కానీ కడుపులోని బిడ్డకు చిన్న హాని కూడా జరగవద్దని తాపత్రయపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. కరోనా వైరస్ గర్భవతుల నుంచి వారికి జన్మించే శిశువులకు సోకదట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇస్మార్ట్ భామ అందాల ‘నిధి’ Bold photos


ప్రమాదకర వైరస్ ఎట్టి పరిస్థితుల్లోనూ డెలివరీ సమయంలో నవజాత శిశువులకు సంక్రమించదని ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ అనే జర్నల్‌లో ఈ విషయాలు వెల్లడించారు. కరోనా సోకిన నలుగురు గర్భవతులు ఇటీవల వూహాన్ ఆస్పత్రిలో శిశువులకు జన్మనివ్వగా.. వారి నుంచి కరోనా వైరస్ పిల్లలకు సోకలేదని గుర్తించారు. కరోనా వైరస్ సోకినట్లు గుర్తించిన ఆ మహిళల్ని ఐసోలేషన్‌లో ఉంచి వైద్యులు ట్రీట్ మెంట్ అందించారు. అందులో ముగ్గురు మహిళలు పరీక్షలకు అంగీకరించగా.. మరో మహిళ ఆ సాహస నిర్ణయానికి వెనుకాడినట్లు సమాచారం.


షాకింగ్.. భారత్‌లో మరో కరోనా మరణం


ఆ మహిళలు జన్మనిచ్చిన శిశువులకు ఇతరత్రా చిన్న చిన్న సమస్యలు కనిపించాయని, వారం రోజుల్లో అంతా సక్రమంగానే ఉందని వైద్యులు చెప్పారు. అయితే కోవిడ్19 వైరస్ తల్లి నుంచి నవజాత శిశువుకు సోకినట్లు ఎక్కడా తేలకపోవడం శుభసూచకమని భావిస్తున్నారు. హువాజాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ అధ్యయనం చేసింది.  కరోనాను వాడేస్తున్న పులిహోర రాజాలు..!


కాగా, గతంలో వణికించిన ప్రమాదకర సార్స్, మెర్స్ వల్ల దుష్పరిణామాలే వచ్చాయని అధ్యయనంలో పేర్కొన్నారు. సార్స్, మెర్స్ వల్ల అబార్షన్ కావడం, లేక పుట్టిన వెంటనే చిన్నారులు చనిపోవడం లాంటివి జరిగినట్లు రీసెర్చర్లు ఆ జర్నల్‌లో ప్రచురించారు. సార్స్, మెర్స్‌లతో పోల్చితే గర్బవతులకు కరోనా వైరస్ అంతగా నష్టం చేకూర్చలేదని ఊపిరి పీల్చుకుంటున్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..