Monkeypox Virus: మంకీపాక్స్ కలవరం.. ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్‌ల్లో వెలుగుచూసిన కేసులు!
Monkeypox Virus: మంకీపాక్స్ కేసులు నమోదవుతున్న దేశాల సంఖ్య పెరుగుతుంది. తాజాగా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్‌ల్లో తొలి మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి.
Monkeypox Virus: ఓ పక్క కరోనా వైరస్ తో ప్రజలు అల్లాడుతుంటే.. ఇప్పుడు తాజాగా మంకీపాక్స్ (Monkeypox) ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ వ్యాధి శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్‌ల్లో మంకీపాక్స్ కేసులు (Monkeypox cases)వెలుగుచూశాయి. ఈ విషయాన్ని ఆయా దేశాలు అధికారికంగా ప్రకటించాయి. విదేశాల నుంచి తొరిగొచ్చిన వ్యక్తిలో ఈ వ్యాధి లక్షణాలు గుర్తించినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వారు తెలిపారు. మరోవైపు స్విట్జర్లాండ్ లో మంకీపాక్స్ సోకిన వ్యక్తి కాంటాక్ట్‌లోకి వచ్చిన వ్యక్తులందరికీ టెస్టులు చేస్తున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు.
తొలిసారి ఎప్పుడంటే..
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 80 మంకీపాక్స్ కేసులను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్వో (WHO) ప్రకటించింది. మరో 50 కేసులు అనుమానిత జాబితాలో ఉన్నాయని తెలిపింది. ఈ జబ్బును 1958లో తొలిసారి కోతుల్లో గుర్తించారు. అందుకే ఈ వ్యాధికి 'మంకీపాక్స్' అని పేరు పెట్టారు. మానవుల్లో తొలి కేసు 1970ల్లో బయటపడింది. తొలిసారి ఈ వ్యాధిని మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో గుర్తించారు.
మంకీపాక్స్ లక్షణాలు:
జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాపు, నడుంనొప్పి, అలసట వంటివి మంకీపాక్స్ లక్షణాలు. చికెన్ పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై బొబ్బలు వస్తాయి. ఈ లక్షణాలు 14-21 రోజుల్లో కనిపిస్తాయి. మశూచి టీకాలే మంకీపాక్స్ నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. మంకీపాక్స్ ఒక వైరల్ డిసీజ్. తుంపర్ల ద్వారా లేదా వ్యాధి సోకిన వ్యక్తి కరిచినా లేదా అతడికి దగ్గర ఉన్నా ఈ వ్యాధి సోకే అవకాశముంది. ఇది ముఖ్యంగా జంతువుల ద్వారా మనుషులకు సోకుతుంది.
Also Read:Srilanka Crisis:15 వందలకు లీటర్ పెట్రోల్.. శ్రీలంకలో పెరుగుతున్న ఆకలి చావులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి