Israel-Hamas war: ఇజ్రాయెల్ లో కేరళ వాసి మృతి.. నాన్న కావాలంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఐదేళ్ల చిన్నారి..
Pat Nibin Maxwell Died: ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య భీకరంగా యుధ్దం కొనసాగుతుంది. బాంబులు, క్షిపణి దాడులతో ఆ ప్రాంతా మంతా పూర్తిగా ధ్వంసమైంది. వందల మంది అమాయకులు మరణించారు. ఆస్పత్రులన్ని బాధితులతో నిండిపోయాయి. కొన్ని నెలల క్రితం భారత్ కు చెందిన కేరళకు చెందిన పాట్ నిబిన్ మాక్స్ వెల్ అక్కడికి వెళ్లాడు.
Kerala Man Killed In Israel: ఇజ్రాయెల్-లెబనాన్ ల మధ్య భీకరమైన యుధ్దం నడుస్తోంది. ఇజ్రాయెల్ అన్నివిధాలుగా లెబనాన్ పై బాంబులతో విరుచుకుపడుతుంది. అయితే.. ఈ యుధ్దలో అమాయకులకు ఎందరో ప్రాణాలు కొల్పోతున్నారు. తాజాగా, భారత్ కు చెందిన 31 ఏళ్ల పాట్ నిబిన్ మాక్స్ వెల్ సరిహద్దుల్లో క్షిపణి దాడిలో నిన్న మరణించించినట్లు తెలుస్తోంది. ఇతను రెండు నెలల క్రితమే.. కేరళలోని కొల్లాంనుంచి ఇజ్రాయెల్ కు వచ్చాడు. ఇతనికి ఐదేళ్ల కుమార్తె ఉన్నట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. అతని భార్య ప్రస్తుతం గర్భవతి కూడా.
అయితే.. ఇజ్రాయెల్ లో .. పాట్ నిబిన్ మాక్స్‌వెల్ మార్గాలియోట్‌లో ఓ ఆర్చర్డ్ సమీపంలో క్షిపణి దాడిలో నిన్న మరణించాడు. ఈ దాడిలో కేరళకు చెందిన మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఇడుక్కికి చెందిన పాల్ మెల్విన్, బుష్ జోసెఫ్ జార్జ్ ఇజ్రాయెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం "పండ్లతోటను సాగు చేస్తున్న శాంతియుత వ్యవసాయ కార్మికులపై షియా ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా చేసిన దాడిని ఉగ్రవాద దాడిని ఖండించింది. భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలోన్, మాక్స్‌వెల్ సోదరుడితో మాట్లాడి, అతనికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
నిబిన్ తండ్రి పాథ్రోస్ మాట్లాడుతూ, నిబిన్ మాక్స్‌వెల్ సోదరుడు కూడా అక్కడే జాబ్ చేస్తున్నట్లు తెలిపాడు. మొదట పెద్దకొడుకు వచ్చి వెళ్లాడని, తర్వాత చిన్న కొడుకు వచ్చి, ఇటీవల తమతో గడిపి ఇజ్రాయెల్ వెళ్లాడని చెప్పారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశాడు. తొలుత.. ఇజ్రాయెల్ నుంచి.. నిబిన్ మాక్స్ వెల్ భార్యకు ఫోన్ వచ్చిందని, ఆతర్వాత ఆమె తమకు సమాచారం చెప్పిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఘటన గురించి వినగానే.. తామంతా షాక్ కు గురయ్యామని, నిబిన్ నాలుగున్నరేళ్ల కుమార్తెను విడిచిపెట్టి వెళ్లిపోయాడని, అతని భార్య తమ రెండవ బిడ్డతో ఏడు నెలల గర్భవతి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ నుంచి నిబిన్ మృతదేహాన్ని నాలుగు రోజుల్లో కేరళకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను రాయబార అధికారులు చూసుకుంటున్నారు.
Read More: Yashika Aannand: బోల్డ్ పిక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషికా, ట్రెండింగ్ లో పిక్స్
"ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితి, స్థానిక భద్రతా అధికారుల సలహాల దృష్ట్యా, ఇజ్రాయెల్‌లోని భారతీయులందరూ, ముఖ్యంగా ఉత్తర, దక్షిణ సరిహద్దు ప్రాంతాలలో పని చేసే లేదా సందర్శించే వారు ఇజ్రాయెల్‌లోని సురక్షిత ప్రాంతాలకు మకాం మార్చాలని సూచించారు. రాయబార కార్యాలయం వారితో టచ్‌లో ఉందని తెలిపారు. ఇజ్రాయెల్ అధికారులు మా పౌరులందరికీ భద్రత కల్పించాలని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook