China Banking: చైనా ప్రభుత్వం అధికార దాహం గురించి ప్రశ్నించిన తరువాత చైనా దిగ్గజ వ్యాపారవేత్త జాక్ మా కనిపించడం లేదు. చైనా ప్రభుత్వంతో పెట్టుకున్నందుకు జాక్ వ్యాపారం ముక్కలు అవడం ప్రారంభించింది. చైనాలో అలీబాబా ప్రభావం.. ప్రాభవం కనిపించడం లేదు.. లేదా తగ్గిపోయింది అని చెప్పవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | ఈ కొత్త ATM,Banking రూల్స్ తెలియపోతే ఇబ్బంది పడతారు వెంటనే చదవండి


అసలేం జరిగింది...
చైనా (China) ప్రభుత్వం చిన్నపాటి నిరంకుశ ప్రభుత్వమే. అక్కడ అధ్యక్షుడు మారడు.. అధికార పార్టీ మారదు. దాని విధానాలు మారవు. అన్ని కార్యకలాపాలు ప్రభుత్వం కనుసన్నల్లో జరుగుతాయి. ఈ కట్టుబాట్లు జాక్ మా లాంటి వ్యాపారులకు ఇబ్బందులు కూడా కలిగిస్తాయి. ఈ మేరకు జాక్ కొంత కాలం క్రితం చైనా బ్యాంకింగ్ వ్యవస్థ గురించి కామెంట్ చేశాడు. చైనా బ్యాంకింగ్ అనేది పాన్ డబ్బాలాంటిది అని కామెంట్ చేశాడు.


తరువాత ఏమైంది ?
అలీబాబా ఫౌండర్ జాక్ మా (Jack ma) చేసిన ఈ వ్యాఖ్యాలు అక్కడి ప్రభుత్వానికి ముఖ్యంగా అక్కడి అధికారులకు నచ్చలేదు. దాంతో వెంటనే అలీబాబా సంస్థ విడుదల చేయాల్సిన ప్రపంచంలోనే అది పెద్ద ఐపీఓలో ఒకటైన పబ్లిక్ ఆఫరింగ్‌ను నిలిపివేసింది ప్రభుత్వం. అధికారుల నుంచి జాక్ చివాట్లు కూడా అందుకున్నాడు. తరువాత వార్త నుంచి పూర్తిగా మాయం అయ్యాడు. తరువాత కనిపించడం లేదు. 



Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం


2020 నవంబర్ 29 నుంచి ఇప్పటి వరకు జాక్ బయటి ప్రపంచానికి కనిపించలేదు. చైనా ప్రభుత్వం అతని కదలికలపై ఆంక్షలు విధించిందేమో అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook