Flights Collided: జపాన్‌లో రెండు విమానాలు ఢీ, 5 మంది మృతి, మంటల్లో 400 మంది ప్రయాణీకులు
Flights Collided: జపాన్‌లోని టోక్యో విమానాశ్రయంలో ఘోర ప్రమాదం సంభవించింది. టోక్యోలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాలు పరస్పరం ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఏకంగా 400 మంది ప్రయాణీకులు మంటల్లో చిక్కుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flights Collided: జపాన్ రాజధాని టోక్యో నగరంలో జరిగిన ఘోర ప్రమాదమిది. నగరంలోని హనెడా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న విమానం అక్కడే ఉన్న కోస్ట్ గార్డ్ ఎయిర్ క్రాఫ్ట్‌ను ఢీ కొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా అలముకోవడంతో 400 మంది ప్రయాణీకులు చిక్కుకుపోయారు. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
జపాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన జేఎల్ 516 విమానం హోకియాడో నుంచి వస్తోంది. హనెడో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగానే మంటలు వ్యాపించాయి. రన్ వేపై దిగుతున్నప్పుడు విమానం చక్రాల్నించి మంటలు వెలువడుతున్న దృశ్యాలు స్పష్టంగా వివిధ కమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
ల్యాండ్ అయ్యే క్రమంలో అక్కడ ఆగి ఉన్న మరో కోస్ట్‌గార్డ్ విమానాన్ని డీ కొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. భారీగా మంటలు అలముకున్నాయి. ఆ సమయంలో విమానంలో 3791 మంది ప్రయాణీకులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. మంటల్లో చిక్కుకున్న ప్రయాణీకులందరూ అదృష్ఠవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఎయిర్ క్రాఫ్ట్‌లో ఉన్న ఆరుగురిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదం అనంతరం హనెడో విమానాశ్రయాన్ని మూసివేశారు. ప్రమాదానికి కచ్చితమైన కారణమేంటనేది ఇంకా తెలియలేదు. దాదాపు 70 అగ్మి మాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశాయి. విమానం నుంచి పెద్దఎత్తున ఎగసిపడుతున్న మంటలు, ల్యాండ్ అవుతున్న విమానం చక్రాల్నించి వస్తున్న మంటల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also read: Japan Earthquake Updates: జపాన్ భూకంపంలో 57కు చేరిన మరణాలు, ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook