US Vaccination: అగ్రరాజ్యం అమెరికాలో సరికొత్తగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. వంద రోజులు..పదికోట్ల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. నూతన అధ్యక్షుడు జో బిడెన్  వ్యాక్సినేషన్ కార్యాచరణ విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా ( America ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ ( Joe Biden ) వ్యాక్సినేషన్ సరికొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు..వంద రోజుల్లో పదికోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నామని వెల్లడించారు. అదే సమయంలో దేశంలో ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం విఫలమైందని జో బిడెన్ విమర్శించారు. మరో రెండ్రోజుల్లో అంటే ఈ నెల జనవరి 20న దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపధ్యంలో జో బిడెన్..దేశంలోని ఆరోగ్య సంక్షోభంపై చర్చించారు. వ్యాక్సినేషన్ ( Vaccination ) పూర్తిగా విఫలమైందని..దేశంలో ఎక్కడ జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఎక్కడ అవసరమో అక్కడ వ్యాక్సిన్ లేదని..లక్షలాదిమందికి టచీకా అవసరముండగా..అంతే సంఖ్యలో దేశవ్యాప్తంగా ఫిజ్ లలో నిరుపయోగంగా వ్యాక్సిన్‌లు పడున్నాయని జో బిడెన్ వ్యాఖ్యానించారు. 


దేశంలో సంభవిస్తున్న కోవిడ్ మరణాల్లో 80 శాతం వరకూ 65 ఏళ్లు పైబడినవారున్నారని..వారికే ముందుగా టీకా ఇస్తామని జో బిడెన్ తెలిపారు. ప్రస్తుతం ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ జరుగుతోందని..వ్యాక్సినేషన్ సెంటర్లను మరింతగా పెంచుతామని అన్నారు. మొబైల్ క్లినిక్స్‌ను పెంచుతామని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా కొనసాగించేందుకు ఔషధ దుకాణాల్ని పూర్తిగా వినియోగిస్తామన్నారు. డిఫెన్స్ చట్టాన్ని ఉపయోగిస్తామన్నారు. వ్యాక్సిన్ డోసుల్లో సగానికి పైగా నిల్వ ఉంచి..ప్రజలకు అందించకుండా నిర్వీర్యం చేస్తున్నారని డోనాల్డ్ ట్రంప్‌ ( Donald trump )పై మండిపడ్డారు.


Also read: Pfizer vaccination: ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని నార్వేలో 23 మంది మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook