అమెరికా అధ్యక్ష ఎన్నికల ( America president Elections ) ఉత్కంఠ పూర్తిగా తొలగిపోయింది. నాలుగు రోజుల ఉత్కంఠ అనంతరం క్లారిటీ వచ్చింది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ ( Democratic party Joe Biden ) ఘన విజయం సాధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఉత్కంఠతకు నాలుగు రోజుల అనంతరం తెరపడింది. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ ( Joe Biden )  ఘన విజయం సాధించారు. అమెరికా అధికార పీఠానికి మొత్తం 530 ఎలక్టోరల్ ఓట్లలో కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 270. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) రెండోసారి పోటీ పడగా..డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా జో బిడెన్ బరిలో నిలిచారు. 


నాలుగు రోజుల్నించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జో బిడెన్ 264 ఓట్లు, ట్రంప్ 214 ఓట్లు సాధించిన తరువాత ...మరో ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతుండటంతో రెండు రోజుల నుంచి సస్పెన్స్ నెలకొంది. మొత్తానికి ఇప్పుడా సస్పెన్స్ తొలగిపోయింది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికయ్యారు. 


ప్రస్తుతం జో బిడెన్  284 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా..ట్రంప్ 214 వద్దే నిలిచిపోయారు. Also read: US Election Results: ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ జో బిడెన్‌దే ఆధిక్యం